Pravalika: నిరుద్యోగ యువతి ఆత్మహత్య..పోటీ పరీక్షల వాయిదానే కారణమా? హైదరాబాద్.. అశోక్‌నగర్‌లో విషాదం జరిగింది. 25 ఏళ్ల ప్రవల్లిక.. అర్థరాత్రి బృందావన్ హాస్టల్ గదిలో ఉరివేసుకొని చనిపోయింది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూసిన ఆమె, అది రాకపోవడం వల్లే ఆత్మహత్య చేసుకుందని ఇతర విద్యార్థులు చెబుతున్నారు. ఘటనా స్థలంలో ఆమె తల్లిదండ్రులకు రాసినట్లుగా ఉన్న సూసైడ్ నోట్‌ను పోలీసులు సేకరించారు. By Manogna alamuru 14 Oct 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Group 2 Aspirant Pravalika Suicide: హైదరాబాద్ అశోక్‌నగర్‌లో ప్రభుత్వ పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బృందావన్ హాస్టల్‌లో ఉంటున్న ప్రవల్లిక.. తన గదిలో ఉరివేసుకుని ప్రాణం తీసుకుంది. హాస్టల్‌లో ఉంటూ ప్రవల్లిక (Pravalika) పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. ప్రవల్లిక ఆత్మహత్య విషయం తెలుసుకున్న పోలీసులు.. విద్యార్థిని మృతదేహాన్ని తీసుకెళ్ళేందుకు హాస్టల్‌కు చేరుకున్నారు. కానీ అప్పటికే అక్కడ భారీగా చేరుకున్న విద్యార్ధులు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, విద్యార్ధులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ట్రాఫిక్ కూడా జామ్ అయింది. వరంగల్ (Warangal) జిల్లాకు చెందిన ప్రవల్లిక పోటీ పరీక్షల కోసం అశోక్ నగర్‌లో ఉంటూ ప్రిపేర్ అవుతోంది. అయితే గ్రూప్ 2 (TSPSC Group 2) పరీక్ష మరోసారి వాయిదా పడింది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్య చేసుకుందని స్నేహితులు చెబుతున్నారు. అయితే ప్రవల్లిక సూసైడ్ నోట్ లో ఎక్కడా పోటీ పరీక్షల గురించి ప్రస్తావించలేదు. నన్ను క్షమించండి అమ్మా! నేను చాలా నష్టజాతకురాలిని.నా వల్ల మీరు ఎప్పుడూ బాధపడుతూనే ఉన్నారు,ఏడ్వకండి. అమ్మా జాగ్రత్తగా ఉండండి. మీకు పుట్టడం నా అదృష్టం అమ్మా. నన్ను కాళ్లు కింద పెట్టకుండా చూసుకున్నారు, మీకు నేను చాలా అన్యాయం చేస్తున్నా. నన్ను ఎవరూ క్షమించరు. మీ కోసం నేను ఏం చేయలేకపోతున్నా అమ్మా. అమ్మ నాన్న జాగ్రత్త! అంటూ తన సూసైడ్ నోట్లో రాసింది. అ సంఘటన నిన్న రాత్రి చోటు చేసుకుంది. దీంతో రాత్రికి రాత్రే ప్రవల్లిక ఆత్మహత్య చేసుకున్న హాస్టల్ దగ్గరకు భారీ సంఖ్యలో విద్యార్దులు చేరుకుని ధర్నాలు చేస్తున్నారు.తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు . పోలీసులు వీరిని చెదరగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు ప్రవల్లిక ఆత్మహత్య విషయం తెలుసుకున్న బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న అభ్యర్థులకు సంఘీభావం తెలిపారు. Also Read: భవ్యశ్రీ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ పై తల్లిదండ్రులు ఎమన్నారంటే..? #hyderabad #pravallika #warangal-pravalika మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి