Telangana: గ్రూప్-1 మెయిన్స్, గ్రూప్ -2, గ్రూప్-3 పరీక్ష తేదీల ప్రకటన

తెలంగాణలో గ్రూప్స్ పరీక్షల తేదీలు వచ్చేశాయి. ఆగస్టు 7 నుంచి నవంబర్ 18 వరకు ఈ పరీక్షలు నిర్వహించేలా టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్‌ 2, అక్టోబర్‌ 21 గ్రూప్‌ -1 మెయిన్స్, నవంబర్ 17, 18న గ్రూప్ 3 పరీక్షలు జరగనున్నాయి.

Group-1: గ్రూప్ 1 మెయిన్స్ షెడ్యూల్ విడుదల
New Update

TSPSC Group 1, Group 2, Group 3 Exam Dates: తెలంగాణలో గ్రూప్స్ పరీక్షల తేదీలు వచ్చేశాయి. ఆగస్టు 7 నుంచి నవంబర్ 18 వరకు ఈ పరీక్షలు నిర్వహించేలా టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్‌ 2, అక్టోబర్‌ 21 గ్రూప్‌ -1 మెయిన్స్, నవంబర్ 17, 18న గ్రూప్ 3 పరీక్షలు జరగనున్నాయి.

TSPSC Group 1, Group 2, Group 3 Exam Dates:

గ్రూప్‌-2 లో మొత్తం 783 ఖాళీ పోస్టులు ఉన్నాయి. అలాగే గ్రూప్‌-3 లో చూసుకుంటే 1388 ఖాళీ పోస్టులు ఉన్నాయి. ఇక గ్రూప్‌-1లో 563 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇదిలాఉండగా.. గ్రూప్‌-1 ఉద్యోగాలకు సంబంధించి మార్చి 14 వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగనుంది. జూన్‌ 9న గ్రూప్‌-1 పరీక్ష నిర్వహించనున్నట్లు ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. గ్రూప్‌- 2 ఉద్యోగాలకు.. 5.51 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. గ్రూప్‌-3 కి కూడా 5 లక్షలకు పైగా అభ్యర్థులు అప్లై చేసుకున్నారు.

Also Read: ఏఐ రోబో టీచర్‌ వచ్చేసిందోచ్‌.. ఎక్కడంటే

గతంలో గ్రూప్‌-1 పరీక్ష పేపర్ లీక్ కావడం, ఆ తర్వాత మరోసారి బయోమెట్రిక్ వివరాలు తీసుకోకపోవడం, హాల్‌ టికెట్లు లేకుండా ఓఎంఆర్ షీట్లు ఇవ్వడం లాంటి తప్పిదాల వల్ల రెండు సార్లు ఈ పరీక్ష రద్దైన సంగతి తెలిసిందే. దీంతో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై గ్రూప్‌ ఉద్యోగాల భర్తీ విషయంలో నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. గత ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్-1 పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసి.. కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అంతేకాకుండా ఈసారి 60 కొత్త పోస్టులను కూడా పెంచి మొత్తం 563 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ.. తాము అధికారంలోకి వస్తే త్వరలోనే గ్రూప్‌ ఉద్యోగాలను భర్తీ చేస్తామని నిరుద్యోగులకు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Also Read: విద్యార్ధులకు అలెర్ట్.. ఐసెట్ నోటిఫికేషన్ విడుదల

#tspsc-group-1 #tspsc #tspsc-group-2 #tspsc-group-3
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe