Swiggy IPO : స్విగ్గీ ఐపీఓకు వాటాదారుల గ్రీన్ సిగ్న‌ల్‌.. కంపెనీ టార్గెట్ ఇదే..!

బెంగ‌ళూరు కేంద్రంగా ప‌ని చేస్తున్న ఫుడ్ డెలివ‌రీ అగ్రిగేట‌ర్ స్విగ్గీ (Swiggy). దేశీయ స్టాక్ మార్కెట్ల‌లో లిస్టింగ్ అయ్యేందుకు సిద్ధ‌మైంది. ఈ మేర‌కు ఇన్షియ‌ల్ ప‌బ్లిక్ ఆఫ‌ర్ (ఐపీఓ) ద్వారా నిధుల సేక‌ర‌ణ‌కు వాటాదారులు అనుమ‌తించార‌ని స్విగ్గీ రెగ్యులేట‌రీ ఫైలింగ్‌లో తెలిపింది.

Swiggy-Zomato: కస్టమర్లకు షాకిచ్చిన స్విగ్గీ, జొమాటో..ఆ ఫీజు 20 శాతం పెంపు!
New Update

Swiggy : బెంగ‌ళూరు(Bangalore) కేంద్రంగా ప‌ని చేస్తున్న ఫుడ్ డెలివ‌రీ(Food Delivery) అగ్రిగేట‌ర్ స్విగ్గీ దేశీయ స్టాక్ మార్కెట్ల‌(Stock Market) లో లిస్టింగ్ అయ్యేందుకు సిద్ధ‌మైంది. ఈ మేర‌కు ఇన్షియ‌ల్ ప‌బ్లిక్ ఆఫ‌ర్(ఐపీఓ)(Swiggy IPO) ద్వారా నిధుల సేక‌ర‌ణ‌కు వాటాదారులు అనుమ‌తించార‌ని స్విగ్గీ రెగ్యులేట‌రీ ఫైలింగ్‌లో తెలిపింది. ఫుడ్‌, గ్రాస‌రీ డెలివ‌రీ కంపెనీ ఐపీఓ ద్వారా రూ.3,750 కోట్లు (450 మిలియ‌న్ డాల‌ర్లు), అద‌నంగా ఆఫ‌ర్ ఫ‌ర్ సేల్ (ఓఎఫ్ఎస్‌) ద్వారా రూ.6,664 కోట్ల (800 మిలియ‌న్ డాల‌ర్లు) నిధులు సేక‌రించాల‌ని ల‌క్ష్యాన్ని నిర్దేశించుకున్న‌ట్లు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లో దాఖ‌లు చేసిన ఫైలింగ్‌లో స్విగ్గీ పేర్కొంది.

ఆల్ట్రావ‌యోలెట్ నుంచి ఎఫ్‌77 ఈవీ అప్‌డేటెడ్ బైక్ ఆల్ట్రావ‌యోలెట్ ఎఫ్‌77 మ్యాచ్ 2.. రూ.2.99 ల‌క్ష‌ల నుంచి షురూ..! అయితే ఐపీఓకు వెళ్లేందుకు దేశీయ స్టాక్ మార్కెట్ల రెగ్యులేట‌రీ సంస్థ `సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా(SEBI) ముందు ఇంకా స్విగ్గీ ద‌ర‌ఖాస్తు చేసింది. ప్రీ-ఐపీఓ ద్వారా యాంక‌ర్ ఇన్వెస్ట‌ర్ల నుంచి రూ.750 కోట్ల నిధులు సేక‌రించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ది. ఫ‌స్ట్‌క్రై, ఓలా ఎల‌క్ట్రిక్‌, ఏడ‌బ్ల్యూఎఫ్ఐఎస్ వంటి నూత‌న త‌రం స్టార్ట‌ప్ సంస్థ‌లు గ‌తేడాది ఐపీఓకు వెళ్లాయి. స్విగ్గీలో డ‌చ్ లిస్టెడ్ కంపెనీ ప్రోస‌స్ 33 శాతం వాటాతో అతిపెద్ద ఇన్వెస్ట‌ర్‌గా ఉంటుంది. త‌ర్వాతీ స్థానాల్లో సాఫ్ట్‌బ్యాంక్‌, ఎస్సెల్‌, ఎలివేష‌న్ క్యాపిట‌ల్‌, మైటూన్‌, నార్వెస్ట్ వెంచ‌ర్ పార్ట‌న‌ర్స్‌, టెన్సెంట్, డీఎస్టీ గ్లోబ‌ల్‌, ఖ‌తార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, కోట్యూ, ఆల్ఫా వేవ్ గ్లోబ‌ల్‌, ఇన్‌వెస్కో, హిల్‌హౌస్ క్యాపిట‌ల్ గ్రూప్‌, జీఐసీ వంటి సంస్థ‌లు ఇన్వెస్ట్‌మెంట్ చేశాయి. స్విగ్గీ కో-ఫౌండ‌ర్లు శ్రీహ‌ర్ష మేజేటికి 4, నంద‌న్‌రెడ్డికి 1.6, రాహుల్ జైమినీకి 1.2 శాతం వాటా ఉంది. 2020లో రాహుల్ జైమినీ త‌న నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ల నుంచి తప్పుకుని, పెస్టో టెక్ అనే మ‌రో జాయింట్ వెంచ‌ర్ సంస్థ‌తో పెట్టుబ‌డులు పెట్టారు.

శ్రీ‌హ‌ర్ష మేజేటీ, నంద‌న్‌రెడ్డిల‌ను ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్లుగా ఈ నెల 23న స్విగ్గీ వాటాదారుల స‌మావేశం నియ‌మించింది. శ్రీ‌హ‌ర్ష మేజేటిని కంపెనీ మేనేజింగ్ డైరెక్ట‌ర్ కం సీఈఓ, నంద‌న్ రెడ్డిని హోల్‌టైం డైరెక్ట‌ర్ అండ్ ఇన్నోవేష‌న్ హెడ్‌గా నియ‌మితుల‌య్యారు. 2021-22 ఆర్థిక సంవ‌త్స‌రంతో పోలిస్తే 2023 మార్చి నెలాఖ‌రు నాటికి కంపెనీ ఆప‌రేష‌న్ల ద్వారా 45 శాతం పెంచుకుని రూ.8,265 కోట్ల ఆదాయం పెంచుకుంది. నిక‌ర న‌ష్టం కూడా 15 శాతం పెరిగి రూ.4,179 కోట్ల‌కు చేరుకున్న‌ది.

Also Video : ఏది తినాలన్నా భయమే..మదపడుతున్న క్యాన్సర్ భూతం

#swiggy-ipo
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe