ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధన ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామానికి తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 4,356 బోధనా సిబ్బందిని భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చింది.ఈ మేరకు ఆర్థిక శాక ఉత్తర్వులు జారీ చేసింది. 26వైద్య కళాశాలల్లో 4,356 బోధనా సిబ్బంది నియామకం చేపట్టనున్నారు. 3,155 కాంట్రాక్టు సిబ్బంది, గౌరవ వేతనంతో 1201 బోధనా సిబ్బంది నియామకానికి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లు, సీనియర్ రెసిడెంట్లు నియమాకాలు చేపట్టాలని జీవోలో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్ లో మార్పులు..!
నీట్(NEET) అభ్యర్థులకు ఎన్ టీఏ గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో(Health Education Course) ప్రవేశాల కోసం నిర్వహించే NEET (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) యూజీ పరీక్ష దరఖాస్తుల గడువు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల విడుల చేసిన నోటిఫికేషన్ ప్రకారం అప్లికేషన్ తేదీ మార్చి 9తో ముగిసింది. అయితే ఈ ఏడాది మరింత సంఖ్యపెరిగిన విషయాన్ని పరిగణలోకి తీసుకుని మార్చి 16 వరకు గడువు పొడిగిస్తున్నట్లు NTA వెల్లడించింది.
రికార్డు స్థాయిలో దరఖాస్తులు..
ఈ మేరకు మే 5న నీట్ పరీక్ష(NEET Exam) ను నిర్వహించనుండగా ఇంగ్లీష్, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో పెన్ను, పేపర్ విధానంలో ఈ ఎగ్జామ్ జరగనుంది. అలాగే ఈసారి నీట్ పరీక్షకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మార్చి 9నాటికి 25లక్షల మందికి పైగా అప్లికేషన్స్ పెట్టుకున్నారని, గతేడాదితో పోలిస్తే ఈఏడాది 4 లక్షలకు మించి దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు.
ఇక గడువు పొడగింపుపై అభ్యర్థుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్ నెట్ సమస్యల కారణంగా పలు ఇబ్బందులు ఎదుర్కొన్నామని, పెంచిన గడువుతో తమకు ఉపశమనం లభించిందంటున్నారు. నీట్ దరఖాస్తు చేసుకునేందుకు ఈ వెబ్ సైట్ ను సంప్రదించంది. https://neet.nta.nic.in/