Cancer Diagnosis : క్యాన్సర్(Cancer) చికిత్స చాలా ఖర్చుతో కూడుకున్నది. నిజానికి చికిత్స మాత్రమే కాదు ఈ మహమ్మారి సోకిందని నిర్ధారించుకోవడానికి కూడా చాలా ఖర్చు అవుతుంది. వేలకు వేలు పోస్తే కానీ టెస్ట్ జరగదు. అయితే ఇకపై ఈ ఖర్చు భారీగా తగ్గే అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా క్యాన్సర్ నిర్ధారణ(Cancer Diagnosis) ఇకపై త్వరగా తక్కువ ఖర్చుతో సాధ్యమవుతుంది. రూ .10తోనే క్యాన్సర్ నిర్ధారణ సాధ్యమవుతుంది. గ్రీన్ ఫ్లోరోసెంట్ ఫిల్టర్ ద్వారా లక్షలాది మంది రోగుల ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది క్యాన్సర్ ఉంది ఏమోనన్న అనుమానం ఉన్నా ఖర్చుకు భయపడి టెస్ట్ చేయించుకోరు. ఆ తర్వాత పరిస్థితి తీవ్రమయ్యాక చేయించుకుంటారు. కానీ తక్కువ ఖర్చుతోనే క్యాన్సర్ నిర్ధారణ జరుగుతుందంటే ముందుగానే చేయించుకోవాలనే ఆలోచన పుడుతుంది. క్యాన్సర్ మొదటి దశలోనే గుర్తిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు.
ఎన్నో ఉపయెగాలు:
- గ్రీన్ ఫ్లోరోసెంట్ ఫిల్టర్(Green Florescent Filter) కణాలలో నిర్దిష్ట ప్రోటీన్లను చూపుతుంది. ఈ ఫిల్టర్ సహాయంతో జన్యు వ్యాధులు, బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే కణాలను గుర్తించడం కూడా సాధ్యమవుతుంది.
ఎంత డబ్బు ఆదా అవుతుంది?
- కొత్త ట్రయల్ కోసం రోగులు ప్రస్తుతం ఖర్చు చేస్తున్న దానిలో 10 నుంచి 15 శాతం మాత్రమే ఖర్చు అవుతుంది. బర్కతుల్లా యూనివర్సిటీ (బీయూ)లో నిర్వహించిన పరిశోధనలు ఈ విషయాన్ని చెబుతున్నాయి. ఈ ముఖ్యమైన పరిశోధనకు పేటెంట్ కూడా లభించింది. క్యాన్సర్ కణాలు ఏ స్థాయిలో ఉన్నాయి? వాటి ప్రస్తుత స్థితి ఏమిటి..? అవి శరీరంలోని ఏ భాగానికి వెళ్తున్నాయో తెలుసుకోవడాన్ని సులభం చేస్తుంది.ఇక ఈ గ్రీన్ ఫిల్టర్ ఖరీదు చాలా తక్కువ. కొత్త ఫిల్టర్ కేవలం రూ.10కే లభిస్తుంది. దీనివల్ల రోగుల ఖర్చులు చాలా ఆదా అవుతాయి.
మరిన్ని వివరాలు:
- ఈ ఫిల్టర్ ను బీయూ బయోకెమిస్ట్రీ అండ్ జెనెటిక్స్ విభాగం అభివృద్ధి చేసింది. విభాగాధిపతి డా. రేఖా ఖండియా(Rekha Khandia) ఆధ్వర్యంలో పీహెచ్ డీ విద్యార్థులు(PHD Students) ఉత్సంగ్ కుమార్, శైలజ సింఘాల్ ఈ పరిశోధన నిర్వహించారు. నిర్దిష్ట ప్రోటీన్ల ఉత్పత్తిని చూపించడానికి గ్రీన్ ఫిల్టర్‌ను ఉపయోగిస్తారని పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం మార్కెట్ లో లభ్యమవుతున్న ఫిల్టర్లు క్వార్ట్జ్ తో తయారు చేస్తున్నారు ఇవి చాలా ఖరీదైనవి. బీయూలోని కొత్త ఫిల్టర్ జెలటిన్ షీట్ల నుంచి తయారు చేస్తున్నారు. ఇది ఒక రకమైన పాలిమర్. అందుకే దీని ధర చాలా తక్కువ.
Also Read : నరాలు బలహీనపడుతున్నాయా? అయితే ఈ విటమిన్ లోపమే కావొచ్చు!