ఘనంగా లష్కర్ బోనాలు.. రేపు భవిష్యవాణి

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిబోనాల ఉత్సవాలకు లష్కర్ ముస్తాబైంది. అమ్మవారి ఆలయంతోపాటు పరిసర ప్రాంతాలను ప్రత్యేకంగా అలకరించారు. అమ్మవారి నామస్మరణ, పోతరాజుల నృత్యాలు, శివసత్తుల పునాకలతో మారుమోగనుంది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించి తొలి బోనం సమర్పణ చేసి ఉత్సవాలు ప్రారంభించారు. భక్తులు అమ్మవారికి బోనాలను సమర్పించి తమ మొక్కులను తీర్చుకుంటున్నారు.

New Update
ఘనంగా లష్కర్ బోనాలు.. రేపు భవిష్యవాణి

Great Lashkar Bonalu tomorrow fortune teller

అమ్మవారికి తొలి బోనం
బంగారు తెలంగాణలో లష్కర్ బోనాలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు వస్తున్నారు. ఏర్పాట్లలో భాగంగా ఉజ్జయిని మహంకాళి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. ఉదయం 4 గంటల నుంచే సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాలు సమర్పిస్తున్నారు. భక్తుల కోసం మొత్తం ఆరు క్యూలైన్లను ఏర్పాటు చేశారు. సాధారణ భక్తుల కోసం, వీఐపీల కోసం ప్రత్యేకంగా క్యూలైన్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. దాతల పాస్‌ల కోసం ప్రత్యేకంగా మరో క్యూలైన్‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ప్రతీ సంవత్సరం ఇది ఆనవాయితీగా వస్తోంది. ఈ ఆలయానికి దగ్గర్‌లోని మోండా మార్కెట్ సమీపంలో జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ కవిత వస్తారు.

రేపే భవిష్యవాణి

ప్రతీ సంవత్సరం మహంకాళి గుడిలో బోనాలు సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. అందువల్ల ఈ సంవత్సరం కూడా 5 లక్షల మంది దాకా వస్తారనే అంచనా ఉంది. అలాగే అమ్మవారి దర్శనం కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, వీఐపీలు పెద్ద సంఖ్యలో రానున్నారు. అందుకే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అడుగడుగునా 175 సీసీ టీవీల నిఘా ఉంది. మహంకాళి పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేక కంట్రోల్ రూం కూడా ఏర్పాటు చేసి..ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అదేవిధంగా సోమవారం జాతరలో భాగంగా భవిష్యవాణి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం రేపు 9.30 గంటలకు ఎమ్మెల్సీ కల్వకుంట కవిత మొండామార్కెట్ ఆదయ్యనగర్ కమాన్ వద్ద నిర్వహించనున్న పాల్గొనున్నారు. అ తర్వాత కవిత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు.

దారి మళ్లీంపు

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వచ్చే వాహనాలు, ఆర్టీసీ బస్సులు మినిస్టర్ రోడ్ మీదుగా రసూల్‌పుర మీదుగా వైఎంసీఎ ఎక్‌సరోడ్ గుండా స్టేషన్‌కు.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వచ్చే బస్సులను చిలకలగూడ ఎక్స్‌రోడ్ మీదుగా, గాంధీ ఆస్పత్రి, ముషీరాబాద్ ఎక్స్‌రోడ్ మీదుగా కవాడిగూడ మారియట్ హోటల్ ట్యాంక్‌బండ్ మీదగా దారి మళ్లీంచారు. సికింద్రాబాద్ నుంచి బాలానగర్, బేగంపేట్, అల్వాల్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను క్లాక్‌టవర్, వైఎంసిఎ చౌ రస్తా, ఫ్యాట్నీ, ప్యారడైజ్‌లు మీదుగా వెళ్లతాయి. ఘాస్‌మండీ ఎక్స్ రోడ్డు గుండా బైబిల్ హౌజ్ నుంచి సికింద్రాబాద్, తిరుమల్ గిరి వైపు వెళ్లే వాహనాలను ఘాస్‌మండి ఎక్స్‌రోడ్ వద్ద సజ్జన్‌లాల్ స్ట్రీట్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, హిల్‌స్ట్రీట్, రాణిగంజ్‌వైపు దారి మళ్లీంచారు. ఫ్యాటీ చౌరస్తా నుంచి వచ్చే వాహనాలను ట్యాంక్ బండ్‌వైపు వచ్చే వాహనాలను ప్యాటీ ఎక్స్‌రోడ్ వద్ద దారి మళ్లీంచి క్లాక్ టవర్, లేక సంగీత్ ఎక్స్‌రోడ్ మీదగా సికింద్రాబాద్ , చిలకలగూడ చౌరస్తా, మూషీరాబాద్ చైరస్తా నుంచి కవాడిగూడ, ట్యాంక్‌బండ్ గుండా వెళ్లాల్సి ఉంది. ప్యారడైజ్ ఎక్స్‌రోడ్‌కు సంబంధించి సిటివో జంక్షన్ నుంచి ఎం.జీ రోడ్డు వైపుదారి మళ్లీంచనున్నారు. ప్యారడైజ్ ఎక్స్‌రోడ్ వైపు సింధీకాలనీ కుడి మలుపు మీదగా మినిస్టర్ రోడ్డు గుండా రాణిగంజ్, కుడి మలుపుకర్బాలి మైదాన్ గుండా వెళ్లాల్సి ఉంటుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు