Ap Crime: అమ్మమ్మ ఇంటికి సెలవులకు వచ్చి.. శవమై తేలాడు.. అసలేమైందంటే?

గోదావరి నదిలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. దసరా సెలవులకు అమ్మమ్మ ఇంటికి వెళ్లిన యువకుడు మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విద్యార్థి సాయి మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.

Ap Crime: అమ్మమ్మ ఇంటికి సెలవులకు వచ్చి.. శవమై తేలాడు.. అసలేమైందంటే?
New Update

గోదావరి నదిలో విద్యార్థి గల్లంతయ్యాడు. ఈ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం మండలం కె.ఏనుగుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. సాధనాల సాయి అనే విద్యార్థి దసరా సెలవుల సందర్భంగా అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. ఐదుగురు యువకులతో కలిసి పుణ్యస్నానాలు ఆచరించేందుకు గోదావరి నదికి వెళ్లారు. దసరా పండుగ ఓ ఇంట విషాదం నింపింది. దసరా సెలవులకు అమ్మమ్మ ఇంటికి వెళ్లి.. ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. యువకుడి ప్రాణాలు పోవటంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అల్లుకున్నాయి.

దసరా సెలవులకు వచ్చి

వివరాల్లోకెళ్తే.. దసరా సెలవులకు అమ్మమ్మ ఇంటికి వచ్చి గోదావరి నదిలో విద్యార్థి గల్లంతైయ్యాడు. ఈ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం కే. ఏనుగుపల్లిలో చోటుచేసుకుంది. కె.ఏనుగుపల్లి బాడవ వద్ద గోదావరిలోకి స్నానానికి ఐదుగురు యువకులు కలిసి దిగిన్నారు. వీరిలో ఒకరు గల్లంతు కాగా.. నలుగురు యువకులు సురక్షితంగా బయటపడ్డారు. సోమవారం సాయంత్రం సరదాగా గోదావరి నది వద్దకు వెళ్లి గోదావరిలో యువకులు స్నానం చేశారు. ఇంతలో అమలాపురంకు చెందిన సాధనాల సాయి (15) గల్లంతైయ్యాడు. సాయి కోసం రాత్రి గాలింపు చర్యలు చేపట్టగా విద్యార్థి మృతదేహం దొరకలేదు. ఉదయం కూడా గల్లంతైన విద్యార్థి కోసం రెవెన్యూ, పోలీసు అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా విద్యార్థి మృతదేహం లభ్యమైంది. యువకుడి మృతదేహం చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

గోదావరిలోకి దిగొద్దని తండ్రి విజ్ఞప్తి

ఈ ఘటనపై విద్యార్థి తండ్రి ప్రసాద్ స్పందించారు. సాయి యువకులతో కలిసి సరదాగా స్థానానికి వెళ్ళాడు. అక్కడ కాలుజారి ప్రమాదవశాత్తు గోదావరిలో నీటిముణిగాడని తెలిపారు. రాత్రంతా పోలీసులు మేము గాలింపు చర్యలు చేపట్టిన మృతదేహం దొరకలేదన్నారు. తెల్లవారుజామున మత్స్యకారులకు దొరికిందన్నారు. దసరా సెలవులకు వచ్చే పిల్లలు గోదావరిలోకి దిగొద్దని తండ్రి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఎవరైనా నదికి వెళ్లి స్నానం చేస్తే జాగ్రత్తగా ఉండాలని కోరారు. సర్పంచ్‌ తోలేటి బంగారు నాయుడు స్పందిస్తూ.. యువకుడు మృతి చెందటం చాలా బాధాకరమన్నారు. పండుగ సందర్భంగా ఇలా జరగటం గ్రామమంతా విషాదఛాయలో మునిగిందన్నారు. ఇక ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: కూకట్‌పల్లి సెలూన్ షాప్ లో మర్డర్.. ఆ గ్యాంగ్ పనేనా?

#ambedkar-konaseema-district #k-enugupalli-village #p-gannavaram-mandal #dussehra-holidays-died #grandmother-house
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe