New Year : కొత్త ఏడాది గ్రాండ్ ఓపెనింగ్...ఈనెలలో లాంచ్ కానున్న 3 ఎస్ యూవీలు ఇవే..!!

కొత్త ఏడాది 2024 జనవరి నెలలో ఆటోరంగానికి చెందిన ప్రముఖ కంపెనీలు మూడు కార్లను విడుదల చేయబోతున్నాయి. ఇందులో మెర్సిడెస్ , కియా సొనెట్, హ్యుందాయ్ క్రెటా వంటి కంపెనీలు ఉన్నాయి.

New Year : కొత్త ఏడాది గ్రాండ్ ఓపెనింగ్...ఈనెలలో లాంచ్ కానున్న 3 ఎస్ యూవీలు ఇవే..!!
New Update

New Year : కొత్త ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాం. మీరు ఈ కొత్త సంవత్సరంలో కొత్త కారును కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే మీకో గుడ్ న్యూస్. కొత్త ఏడాది మొదటి నెలలో అంటే జనవరిలో కారుకొనుగోలుదారులకు చాలా ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఆటో రంగానికి చెందిన పెద్ద కంపెనీలు తమ అనేక ఎస్ యూవీలను ఈ నెలలో విడుదల చేయబోతున్నాయి. ఈ జాబితాలో కియా సొనెట్ (Kia Sonet) ,  హ్యుందాయ్ క్రెటా(Hyundai Creta) , మెర్సిడెస్ ఫేస్ లిఫ్ట్ (Mercedes Facelift)వంటి కంపెనీలు ఉన్నాయి. వీటిలో కొన్ని పూర్తిగా కొత్త లాంచ్ లు అయితే కొన్ని అప్ డేట్ చేసిన ప్రముఖ కార్ల ఫేస్ లిస్ట్ వెర్షన్లు కూడా లాంచ్ కానున్నాయి. జనవరి 2024లో రిలీజ్ కానున్న మూడు అత్యంత ఎదురుచూస్తున్న ఎస్ యూవీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కియా సోనెట్ ఫేస్ లిస్ట్ :

కియా సోనెట్ ఫేస్ లిస్ట్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. 2024లో రానున్న కియా సోనెట్ ఫేస్ లిస్ట్ టాటా నెక్సాస్, హ్యుందాయ్ వెన్యూ, మారుతి సుజుకి బ్రెజ్జాతో పోటీపడుతుంది. కారు ఇంటీరియర్, ఎక్ట్సీరియర్ కు చాలా అప్ డేట్స్ చేశారు. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ధరకు సంబంధించి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. వచ్చే నెల 16న జరగనున్న ఈవెంట్ లో ఈ మోడల్ ను పరిచయం చేయనుంది.

హ్యుందాయ్ క్రెటా ఫేస్ లిస్ట్ :

హ్యుందాయ్ ఇండియా తన బెస్ట్ సెల్లింగ్ పాపులర్ కారు హ్యుందాయ్ క్రెటా యొక్క అప్ డేట్ చేసిన ఫేస్ లిస్ట్ వెర్షన్ జనవరి 16న ఇండియాలో రిలీజ్ చేయబోతోంది. కారులో కస్టమర్స్ రీడిజైన్ చేసిన గ్రిల్స్, స్ప్లిట్ ప్రొజెక్టర్ హ్యాండిల్ ను పొందుతారు. అయితే ఇంటీరియర్ ఏడిఏఎస్ టెక్నాలజీ, 360 డిగ్రీ కెమెరా, అప్ డేట్ చేసిన 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ లభిస్తుంది. అదనంగా రాబోయే కారు శ్రేణిలో 160హెచ్ పి 1.5 లీటర్ టర్బో పెట్రోల్ తో వస్తుంది.

మెర్సిడెస్ ఫేస్ లిఫ్ట్:

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ తన అప్ డేట్ చేసిన మెర్సిడెస్ జీఎల్ఎస్ ఫేస్ లిస్టును జనవరి 8న లాంచ్ చేయనుంది. ఇందులో కస్టమర్లకు సిల్వర్ షాడో ఫినిషింగ్ తో ఇచ్చిన కారు గ్రిల్ లో 4 కొత్త హారిజాంటల్ లౌవర్ లను పొందుతారు. ఇదే కాకుండా కారు కొత్త ఫ్రంట్ బంపర్ , ఎయిర్ ఇన్ లెట్ గ్రిల్స్ తో కూడిన కొత్త టెయిల్ ల్యాంప్స్, హై గ్లోస్ బ్లాక్ సరౌండ్ ను కూడా ఉంటుంది. మెర్సిడెస్ నుంచి రాబోయే కారులో 9 స్పీడ్ ఆటోమెటిక్ గేర్ బాక్స్ 3.0 లీటర్ 6 సిలిండర్ పెట్రోల్, డిజిల్ ఇంజిన్స్ తో వస్తుంది.

ఇది కూడా చదవండి: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో రికార్డు.. హైదరాబాద్ లో ఒక్క రాత్రే ఎంత మంది దొరికారంటే?

#new-year #kia-sonet #hyundai-creta #mercedes-facelift
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe