West Godavari : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం (Tadepalligudem) లో జి.ఆర్.రెడ్డి కంటి హాస్పిటల్ (GR Reddy Eye Hospital) వైద్యుల దోపిడి వెలుగులోకి వచ్చింది. కంటి చెకప్ కోసం వెళ్లిన 70 ఏళ్ల వృద్ధురాలికి HIV పాజిటివ్ (HIV Positive) అని తేల్చారు ల్యాబ్ నిర్వాహకులు. అయితే, హెచ్ఐవి ఉన్న పర్లేదు అదనంగా రూ. 10,000 కడితే ఆపరేషన్ చేస్తామన్నారు ఆసుపత్రి సిబ్బంది. హెచ్ఐవి అనగానే ఆందోళన చెందిన వృద్ధురాలు కుమారుడు.. ప్రైవేట్ ల్యాబ్ కి తీసుకువెళ్లి చెక్ చేయించగా నెగిటివ్ వచ్చింది.
Also Read: ఏపీకి పెట్రోల్ రిఫైనరీ పరిశ్రమ.. చంద్రబాబుతో బీపీసీల్ ప్రతినిధుల భేటీ..!
ఇదేంటని డాక్టర్ సందీప్ రెడ్డిని అడగ్గా ఇవన్నీ మామూలే నని, టెస్టులు ఫెయిల్యూర్ వల్ల వస్తూ ఉంటాయని తేల్చడం గమనార్హం. కేసు పెట్టుకోమని బహిర్గాటంగానే చెప్పడం ఆశ్చర్యానికి లోనయ్యామన్నారు వృద్ధురాలు కుమారుడు. వైద్యం కొరకు వచ్చిన వారిని భయంకరమైన వ్యాధులు పేరుతో భయపెట్టి వారి నుండి భారీగా సొమ్ములు గుంజుతున్నారని బాధితుడు వాపోయాడు.