GPAI Summit 2023: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 21వ శతాబ్దంలో అభివృద్ధికి అతిపెద్ద సాధనంగా మారుతుంది. అలాగే, ఈ శతాబ్దాన్ని నాశనం చేయడంలో అతిపెద్ద పాత్రను కూడా పోషిస్తుంది అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై గ్లోబల్ పార్టనర్‌షిప్ ఈవెంట్ (GPAI సమ్మిట్-2023)లో మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. డీప్‌ఫేక్ సవాలు నేడు ప్రపంచం మొత్తం ముందు ఉంది. అంతే కాకుండా ఉగ్రవాదుల చేతుల్లోకి AI టూల్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. AI నైతిక వినియోగం కోసం గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడానికి మనం కలిసి పని చేయాలి అని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం(GPAI Summit 2023) న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో ప్రారంభం అయింది. ఇది డిసెంబర్ 14 వరకు కొనసాగుతుంది. GPAI సమ్మిట్-2023 కార్యక్రమానికి ప్రధాని మోదీ దేశ ప్రజలను ఆహ్వానించారు. ప్రపంచంలోని దాదాపు 28 దేశాలు AI సమ్మిట్‌లో పాల్గొన్నాయి.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ 5 పెద్ద విషయాలు చెప్పారు:
- AI అనేది కొత్త టెక్నాలజీ మాత్రమే కాదు. ఇది ప్రపంచవ్యాప్త ఉద్యమంగా మారింది. కాబట్టి మనమందరం కలిసి పనిచేయడం అవసరం. AI కచ్చితంగా రూపాంతరం చెందుతుంది. కానీ దానిని వీలైనంత పారదర్శకంగా మార్చడం మన చేతుల్లోనే ఉంది.
- GPAI Summit 2023: AI వారి ప్రయోజనాల కోసం, వారి సంక్షేమం కోసం అని మనం ప్రపంచాన్ని ఒప్పించాలి. ఈ సాంకేతికత అభివృద్ధి ప్రయాణంలో ఎవరూ వెనుకబడి ఉండరని ప్రపంచంలోని వివిధ దేశాలకు కూడా మనం భరోసా ఇవ్వాలి.
- ఈ రోజు భారతదేశం AI ప్రతిభ - AIకి సంబంధించిన కొత్త ఆలోచనలలో అత్యంత ప్రముఖమైన ప్లేయర్ గా ఉంది. ఇక్కడికి రాకముందు ఏఐ ఎక్స్‌పోకు వెళ్లే అవకాశం వచ్చింది. AI జీవితాన్ని ఎలా మార్చగలదో మనం ఈ ఎక్స్‌పోలో చూడవచ్చు. యువత ఆలోచనలు చూసి సంతోషించాను.
- ఇటీవల మేము వ్యవసాయంలో AI చాట్‌బాట్‌ను ప్రారంభించాము. దీని ద్వారా రైతులు తమ దరఖాస్తు స్థితి, చెల్లింపు వివరాలు - ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్‌డేట్‌లను తెలుసుకోవచ్చు. AI సహాయంతో రంగాలను మార్చే దిశగా మేము కృషి చేస్తున్నాము.
- GPAI Summit 2023: మేము భారతదేశంలో AI మిషన్‌ను ప్రారంభించబోతున్నాము. భారతదేశంలో AI కంప్యూట్ పవర్ తగినంత సామర్థ్యాన్ని ఏర్పాటు చేయడం ఈ మిషన్ లక్ష్యం. ఇది భారతదేశంలోని స్టార్టప్‌లు - ఇన్నోవేటర్‌లకు మెరుగైన సౌకర్యాలను అందిస్తుంది. ఈ మిషన్ కింద, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి రంగాలలో AI అప్లికేషన్లు ప్రచారం చేయడం జరుగుతుండి. మేము మా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా టైర్-2 - టైర్-3 నగరాలకు AI నైపుణ్యాలను తీసుకువెళుతున్నాము.
Also Read: నేటి నుంచి ఢిల్లీలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సమ్మిట్
150 కంటే ఎక్కువ స్టార్టప్‌లు..
ప్రపంచంలోని దాదాపు 28 దేశాలు AI సమ్మిట్(GPAI Summit 2023)లో పాల్గొన్నాయి. ఇందులో 150 మందికి పైగా వక్తలు ఏఐపై తమ అభిప్రాయాలను తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో 150కి పైగా AI స్టార్టప్‌లు పాల్గొని తమ AI ఉత్పత్తులను ప్రదర్శించాయి. ఇది కాకుండా, 30కి పైగా టెక్నాలజీ సెషన్‌లు ఉంటాయి.
గత నెల UKలో..
గత నెల, UK AI భద్రతా సదస్సును నిర్వహించింది. ఇక్కడ US, చైనా, జపాన్, యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్, భారతదేశం, యూరోపియన్ 28 యూనియన్‌తో సహా ప్రధాన దేశాలు డిక్లరేషన్‌పై సంతకం చేయడానికి అంగీకరించాయి. AI సంభావ్య ప్రమాదాలను ఎదుర్కోవటానికి ప్రపంచ చర్య అవసరమని ఈ సదస్సు ఏకగ్రీవంగా చెప్పింది.
Watch this interesting Video: