TSPSC: టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌, సభ్యుల రాజీనామాలకు గవర్నర్‌ ఆమోదం.. నోటిఫికేషన్లకు లైన్ క్లీయర్

టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాకు గవర్నర్ తమిళసై ఆమోదం తెలిపారు. దీంతో నూతన చైర్మన్, సభ్యుల కమిటీ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఫిబ్రవరిలో 20 వేల ఉద్యోగాల భర్తీ నేపథ్యంలోనే గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

New Update
TSPSC: టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌, సభ్యుల రాజీనామాలకు గవర్నర్‌ ఆమోదం.. నోటిఫికేషన్లకు లైన్ క్లీయర్

TSPSC:  టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డితోపాటు సభ్యుల రాజీనామాలకు గవర్నర్‌ తమిళిసై ఆమోదం తెలిపారు. దీంతో కొత్త కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుండగా.. పలువురి పేర్లను ఇప్పటికే రేవంత్ సర్కార్ పరిశీలిస్తోంది. ఇక ఈ ప్రక్రియ పూర్తవగానే గతంలో జరిగిన పలు పరీక్షల ఫలితాలు వెలువడనున్నాయి.

ప్రశ్నపత్రాల లీక్..
ఈ మేరకు రాష్ట్రంలో టీఎస్‌పీఎస్సీ బోర్డ్ లో పనిచేస్తున్న పలువురు ప్రశ్నపత్రాలను లీక్ చేయడంతో పెద్ద ఇష్యూగా మారింది. దీంతో నిరుద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్త చేస్తూ టీఎస్‌పీఎస్సీ బోర్డ్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కమిషన్‌ నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. లక్షల మంది నిరుద్యోగుల జీవితాలకు సంబంధించిన అంశంలో ఛైర్మన్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించారని, వెంటనే వారిని తొలగించడంతోపాటు బోర్డును ప్రక్షాళన చేయాలని రాజకీయ పార్టీలు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున్న నిరసనలు చేపట్టారు.

బోర్డు ప్రక్షాళన..
ఈ క్రమంలోనే తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్న టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డి.. రాజీనామా నిర్ణయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం తిరస్కరించింది. కమిషన్‌లో జరిగిన పొరపాట్లు సరిదిద్దాలని, సంస్కరణలు చేపట్టి కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించడంతో ఆయన ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు. రెండోసారి నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను హైకోర్టు రద్దు చేయడంతో కమిషన్‌పై నిరుద్యోగుల్లో మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ సహా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ బోర్డును ప్రక్షాళన చేస్తామంటూ హామీలు ఇచ్చాయి.

ఇది కూడా చదవండి : Guntur Kaaram Song: “మావ ఎంతైనా”.. గుంటూరు కారం నుంచి మరో దుమ్ము లేపే సాంగ్

20వేల ఉద్యోగాలు..
ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం మారడంతో డిసెంబర్‌లో జనార్దన్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తూ రాష్ట్ర గవర్నర్ కు రాజీమానా లేక పంపించారు. అయితే లీకేజీ వ్యవహారం మొత్తం వివరాలు బయటకొచ్చేంత వరకూ  గవర్నర్ రాజీనామా అమోదించలేదు. అయితే తాజాగా ఫిబ్రవరిలో 20వేల ఉద్యోగాల భర్తీ లక్ష్యంగా ముందుకెళ్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్ దీనిపై సీరియస్ గా చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగానే తాజాగా చైర్మన్, సభ్యుల రాజీనామాలకు గవర్నర్ తమిళసై‌ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు