Telangana: మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన గవర్నర్ తమిళిసై.. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. తనపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు గవర్నర్. తనను ఎంత అవమానించినా వెనక్కి తగ్గబోనని గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు. అందరూ అందరికీ నచ్చాలని లేదని, తనపై పువ్వులు వేసే వారు ఉన్నారని, రాళ్లు వేసే వారు కూడా ఉంటారని అన్నారు. By Shiva.K 30 Sep 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana Governor Tamilisai Comments: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. తనపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు గవర్నర్. తనను ఎంత అవమానించినా వెనక్కి తగ్గబోనని గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు. అందరూ అందరికీ నచ్చాలని లేదని, తనపై పువ్వులు వేసే వారు ఉన్నారని, రాళ్లు వేసే వారు కూడా ఉంటారని అన్నారు. రాళ్లు విసిరితే, వాటితో ఇల్లు కట్టుకుంటా.. దాడిచేసి రక్తం చిందిస్తే, దానినే సిరాగా మలుచుకుని తన చరిత్ర లిఖిస్తానని అన్నారు. గవర్నర్‌గా తెలంగాణలో తాను అడుగుపెట్టిన సమయానికి కేబినెట్‌లో ఒక్క మహిళా మంత్రి కూడా లేరని, తాను వచ్చాక ఇద్దరు మహిళా మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించానని అన్నారు. ప్రభుత్వం ప్రొటోకాల్ ఇచ్చినా, ఇవ్వకపోయినా తన పని నేను చేసుకుంటూ పోతానని స్పష్టం చేశారు. లోక్‌సభ, శాసనసభల్లో 33% మహిళా రిజర్వేషన్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలిపారు. గత 27 ఏళ్లుగా ఈ బిల్లు గురించి మాట్లాడుతున్నారు కానీ అమలు కాలేదని పేర్కొన్నారు. ఓ మహిళా రాష్ట్రపతి ఈ బిల్లుపై సంతకం చేయడం విశేషమని అన్నారు. పురుషులతో పోలిస్తే 20 రేట్లు ఎక్కువగా పని చేస్తే కానీ మహిళకు గుర్తింపు లభించదని అన్నారు. ఒకప్పుడు తాను బీజేపీ నేతనని, ఇప్పుడు గవర్నర్ అని పేర్కొన్నారు. అప్పట్లో బీజేపీలో 33 శాతం రిజర్వేషన్‌ను మహిళలకు కల్పిస్తూ పార్టీ నిర్ణయించిందని, ఫలితంగా ఎంతోమంది మహిళలు పార్టీలో చేరారని ప్రస్తావించారు. ప్రధాని మోదీకి స్వాగతం పలికిన గవర్నర్.. #Telangana welcomes honb @PMOIndia Shri @narendramodi for the launch of various welfare schemes in the state https://t.co/bXFPQntpIK — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) September 30, 2023 ఈరోజు (30.09.2023) హైదరాబాద్లోని రాజ్భవన్లో గౌరవ తెలంగాణ గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ గారు, శాసనసభ మరియు లోక్సభలో 33% మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించినందుకు గౌరవనీయులైన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు తెలుపుటకు ఏర్పాటుచేసిన “ధన్యవాదాల కార్యక్రమం”లో… pic.twitter.com/bkFrgAhDPH — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) September 30, 2023 Also Read: Nara Bhuvaneshwari: భువనేశ్వరి నిరాహార దీక్ష.. బాలకృష్ణ సంచలన ప్రకటన Ktr: తెలంగాణ ఎన్నికల కోసం కర్నాటకలో కాంగ్రెస్ పన్ను.. కేటీఆర్ సంచలన ట్వీట్ #telangana #telangana-governor #talangana-politics మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి