Medi Claim: ఆరోగ్య బీమా నిబంధనలలో భారీ మార్పులకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పుడు ఆరోగ్య బీమా కంపెనీలు 24 గంటల కంటే తక్కువ సమయం ఆసుపత్రిలో చేరినట్లయితే, మెడిక్లెయిమ్ క్లెయిమ్‌లను తిరస్కరించడం సాధ్యం కాదు. ఎన్‌సిడిఆర్‌సి ఆరోగ్య బీమా నిబంధనలను సమీక్షించాలని గట్టిగా చెప్పింది. దీనితో పాటు, కొత్త నిబంధనలో అనేక షరతులు తొలగించే అవకాశం ఉంది. దీని కింద, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDA) కూడా ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడానికి గరిష్ట వయోపరిమితిని రద్దు చేయాలని ప్రతిపాదించినందున, బీమా తీసుకోవడానికి గరిష్ట పరిమితి కూడా పెరగవచ్చు.
ఆరోగ్య బీమా నిబంధనలలో మార్పులు!
ప్రస్తుతం బీమా కంపెనీలు రోగిని 24 గంటలకు మించి ఆసుపత్రిలో చేర్చినప్పుడే మెడిక్లెయిమ్(Medi Claim) ఇస్తున్నాయి. అయితే ఈ నిబంధనను సమీక్షించేందుకు ప్రభుత్వం బీమా రంగ నియంత్రణ సంస్థ IRDAI (ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా)తో చర్చలు ప్రారంభించింది. ఈ చర్చల్లో NCDRC ప్రెసిడెంట్ అమరేశ్వర్ ప్రసాప్ షాహి మెడిక్లెయిమ్ ప్రయోజనాన్ని పొందడానికి 24 గంటల ఆసుపత్రిలో చేరే నియమాన్ని సమీక్షించడం గురించి మాట్లాడారు.
ఇప్పుడు వైద్యం ఎంతో అభివృద్ధి చెందిందని, కొన్ని గంటల్లోనే చికిత్స పూర్తవుతుందని, అనేక శస్త్రచికిత్సలు కూడా పూర్తవుతాయని చెప్పారు. కానీ ప్రస్తుత నిబంధనల ప్రకారం, 24 గంటల కంటే తక్కువ సమయం ఆసుపత్రిలో ఉంటే మెడిక్లెయిమ్(Medi Claim) అందుబాటులో ఉండదు. అయితే, ఇప్పుడు 24 గంటల్లోపు పూర్తి చేసే అనేక రకాల చికిత్సలు ఉండడం వలన ఆరోగ్య బీమా సంస్థలు దీనిపై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు.
Also Read: పైకెగసిన స్టాక్ మార్కెట్.. ఈ స్టాక్స్ దుమ్ములేపాయి
ప్రభుత్వం ఈ విషయంలో నిర్ణయం తీసుకుని, అమలు చేస్తే చాలామంది ప్రయివేట్ ఉద్యోగులకు మేలు జరుగుతుంటుంది. ప్రస్తుతం ఆసుపత్రిలో 24 గంటలలోపు వైద్యం తీసుకుంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్(Medi Claim) చేసుకునే అవకాశం లేకపోవడంతో చిన్న, చిన్న ఆపరేషన్స్ చేయించుకున్న వారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ 24 గంటల నిబంధన సడలిస్తే.. అటువంటి వారికీ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పవచ్చు.
పంజాబ్ కోర్టు చారిత్రాత్మక నిర్ణయం
వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఐఆర్‌డీఏఐ, ఆర్థిక సేవల విభాగం పరిష్కారాన్ని కనుగొనాల్సిన అవసరం ఎంతైనా ఉందని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ అన్నారు. తాజాగా పంజాబ్, కేరళ జిల్లా వినియోగదారుల కమిషన్ మెడికల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్(Medi Claim)లకు సంబంధించి చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లా వినియోగదారుల కమిషన్, ఆరోగ్య బీమా కంపెనీపై కఠినంగా వ్యవహరిస్తూ, 24 గంటలు ఆసుపత్రిలో లేరనే నిబంధనతో క్లెయిమ్(Medi Claim) తిరస్కరించడాన్ని తప్పుగా పేర్కొంటూ మెడికల్ క్లెయిమ్‌ను తిరస్కరించినందుకు బాధ్యత వహించి, రోగికి ఆరోగ్య బీమా ప్రయోజనాన్ని ఇవ్వాలని ఆదేశించింది. . ఇప్పటి వరకూ ఇలా మెడిక్లెయిమ్ పై వచ్చిన ఇలాంటి కేసు ఇదే మొదటిది.
Watch this interesting Video: