కర్నాటకలోని బెంగళూరులో విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా ప్రభుత్వ అధికారిని దుండగులు అతి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె కారు డ్రైవరే..ఆమెను అత్యంత దారుణంగా హత్య చేసినట్లు అధికారులు వెల్లడించారు.
కేఎస్ ప్రతిమ రాష్ట్ర గనులు, భూగర్భ శాఖలో జియాలిజిస్ట్ గా పని చేస్తున్నారు. శనివారం రాత్రి ఆమె దారుణ హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. అయిదేళ్ల నుంచి కాంట్రాక్ట్ డ్రైవర్ గా పని చేస్తున్న కిరణ్ అనే వ్యక్తిని కొంత కాలం క్రితం ఉద్యోగం నుంచి తీసివేశారు. దాంతో కక్ష పెంచుకున్న కిరణ్ ఎలాగైన సరే అధికారిణి ప్రతిమను హత్య చేసేందుకు పథకం రచించాడు.
Also read: హైదరాబాద్ లో గ్యాస్ పైప్ లైన్ లీక్..భారీగా ఎగిసిపడుతున్న మంటలు!
అనుకున్న విధంగానే ప్రతిమను కత్తితో కోసినట్లు నిందితుడు కిరణ్ పోలీసులు ముందు అంగీకరించాడు. హత్య చేసిన తరువాత అక్కడ నుంచి పరారైనట్లు పోలీసులు గుర్తించారు. శనివారం హత్య జరగగా..ఆదివారం ఉదయం ఆమె మృతదేహన్ని అధికారులు గుర్తించారు. శనివారం సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఆమె ఆఫీసులోనే ఉన్నట్లు సహా ఉద్యోగులు తెలిపారు.
తరువాత కొత్త డ్రైవర్ ఆమెను ఇంటి వద్ద డ్రాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి భర్త, పిల్లలు శివమొగ్గ జిల్లాలో ఉంటున్నారు. శనివారం రాత్రి 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 మధ్య ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బెంగళూరులో ప్రతిమ గతేడాదిగా పని చేస్తున్నారు.
ఆమె చాలా డైనమిక్ అని ఆ శాఖలో పని చేస్తున్న ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఇటీవల ఆమె కొన్ని ప్రదేశాల్లో తనిఖీలు చేశారని, ఆమెకు ఎవరూ శత్రువులు లేరని, మంచి పేరు సంపాదించుకున్నదని ఓ ఆఫీసర్ తెలిపారు.