AP Holidays 2024 : కొత్త ఏడాది సెలవులు ప్రకటించిన జగన్ సర్కార్.. సంక్రాంతి సెలవుల డేట్స్ ఇవే! 2024 ఏడాదికి సంబంధించిన సెలవుల జాబితాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. పండుగలు, నేషనల్ హాలిడేస్‌ను కలిపి 27 సాధారణ సెలవులు ప్రకటించగా.. 25 ఆప్షనల్ హాలిడేస్‌గా సూచిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. By srinivas 13 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి Jagan Sarkar : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర ప్రభుత్వం 2024 ఏడాదికి సంబంధించిన సెలవుల జాబితాను విడుదల చేసింది. పండుగలు, నేషనల్ హాలిడేస్‌ను కలిపి 27 సాధారణ సెలవులు ప్రకటించగా.. 25 ఆప్షనల్ హాలిడేస్‌గా సూచిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 15 సంక్రాంతి, ఏప్రిల్ 9 ఉగాది, ఏప్రిల్ 17 శ్రీరామనవమి, జూలై 17 మోహర్రం, అక్టోబర్ 12 విజయదశమి, అక్టోబర్ 30 దీపావళి సెలవులుగా పేర్కొంది. జనరల్ హాలీడేస్ : జనవరి 1 న్యూఇయర్ (సోమవారం), జనవరి 14 భోగి (ఆదివారం), జనవరి 15 సంక్రాంతి (సోమవారం), జనవరి 26 రిపబ్లిక్ డే(శుక్రవారం), మార్చ్ 8 మహాశివరాత్రి (శుక్రవారం), మార్చ్ 25 హోళి (సోమవారం), మార్చ్ 29 గుడ్ ఫ్రైడే (శుక్రవారం), ఏప్రిల్ 5 బాబు జగ్జీవన్ రామ్ జయంతి (శుక్రవారం), ఏప్రిల్ 9 ఉగాది (మంగళవారం), ఏప్రిల్ 11 ఈదుల్ ఫితర్ (రంజాన్)(గురువారం), ఏప్రిల్ 12 రంజాన్ మాసం (శుక్రవారం), ఏప్రిల్ 14 డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి (ఆదివారం), ఏప్రిల్ 17 శ్రీరామనవమి (బుధవారం), జూన్ 17 ఈదుల్ అజహా (బక్రీద్) (సోమవారం), జూలై 17 మోహర్రం (బుధవారం), జూలై 27 బోనాలు (సోమవారం), ఆగష్టు 15 స్వాంతంత్ర్యదినోత్సవం (గురువారం), ఆగష్టు 28 శ్రీకృష్ణాష్టమి (సోమవారం), సెప్టెంబర్ 7 వినాయకచవితి (శనివారం), సెప్టెంబర్ 16 ఈద్ మిలానుదీన్‌నబీ (సోమవారం), అక్టోబర్ 2 మహాత్మాగాంధీ జయంతి (బుధవారం), అక్టోబర్ 12 విజయదశమి (శనివారం), అక్టోబర్ 13 విజయదశమి పర్వదినాలు (ఆదివారం), అక్టోబర్ 30 దీపావళి (బుధవారం), సెప్టెంబర్ 15 కార్తీక పౌర్ణమి/గురునానక్ జయంతి (శుక్రవారం), డిసెంబర్ 25 క్రిస్మస్ (బుధవారం), డిసెంబర్ 26 క్రిస్మస్ పర్వదినాలు (గురువారం). ఇది కూడా చదవండి : ధరణిలో లోపాలు.. రేవంత్ సర్కార్ యాక్షన్ ప్లాన్ ఇదే ఆప్షనల్ హాలీడేస్ : జనవరి 16 కనుమ (మంగళవారం), జనవరి 25 హజరత్ అలీ జయంతి (గురువారం), ఫిబ్రవరి 2 షాబ్ ఈ మిరాజ్ (గురువారం), ఫిబ్రవరి 14 శ్రీ పంచమి (బుధవారం), ఫిబ్రవరి 26 షాబ్ ఈ బారాత్ (సోమవారం), మార్చ్ 31 షహదత్ హజత్ అలీ (ఆదివారం), ఏప్రిల్ 5 జుమాతుల్ వాడా (శుక్రవారం), ఏప్రిల్ 7 షాబ్ ఈ ఖాదీర్ (ఆదివారం), ఏప్రిల్ 14 తమిళ్ న్యూ ఇయర్ డే (ఆదివారం), ఏప్రిల్ 21 మహవీర్ జయంతి (ఆదివారం), మే 10 బసవ జయంతి (శుక్రవారం), మే 23 బుద్ధ పౌర్ణమి (గురువారం), జూన్ 25 ఈద్ ఇ గాధీర్ (మంగళవారం), జూలై 7 రథయాత్ర (ఆదివారం), జూలైల 16 9వ మోహర్రం(మంగళవారం), ఆగష్టు 15 పార్సీ న్యూఇయర్ డే (గురువారం), ఆగష్టు 16 వరలక్ష్మీ వ్రతం (శుక్రవారం), ఆగష్టు 19 శ్రావణ పౌర్ణిమ/రాఖీ పౌర్ణమి (సోమవారం), ఆగష్టు 26 అర్బయీన్ (సోమవారం), సెప్టెంబర్ 10 దుర్గాష్టమి (గురువారం), సెప్టెంబర్ 11 మహర్నవమి (శుక్రవారం), సెప్టెంబర్ 15 యాజ్ దహుమ్ షరీఫ్ (మంగళవారం), సెప్టెంబర్ 30 నరకచతుర్ధి (బుధవారం), నవంబర్ 11 హజత్ సయ్యద్ మహ్మద్ జువన్ పురి మహదీ(శనివారం), డిసెంబర్ 24 క్రిస్మస్ ఈవ్ (మంగళవారం). #andhra-pradesh #2024 #holidays #jagan-sarkar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి