AP News : ఏపీ ఏలూరు జిల్లా (Eluru District) లో ప్రభుత్వ విద్యుత్ ఉద్యోగి (Government Employee) రాసలీల బాగోతం (Naked Sex) బయటపడింది. డ్యూటీకి వచ్చి మహిళతో రాసలీలలు కొనసాగిస్తుండగా స్థానికులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. జంగారెడ్డిగూడెం పరిధిలోని పర్రెడ్డిగూడెం విద్యుత్ సబ్‌స్టేషన్ (Electric Substation) లో ఈ ఘటన చోటుచేసుకోగా.. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
గంగు మహేశ్వర రెడ్డి అనే వ్యక్తి పర్రెడ్డిగూడెంలో ఉన్న విద్యుత్ సబ్‌స్టేషన్‌లో షిఫ్ట్ ఆపరేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే బుధవారం తెల్లవారుజామున కరెంట్ పోవడంతో ఉక్కపోత భరించలేక గ్రామస్థులు సబ్‌స్టేషన్‌కు పలుసార్లు ఫోన్ చేశారు. అయినా ఎలాంటి స్పందన లేకపోవడంతో కొంతమంది సబ్‌స్టేషన్ వద్దకు వెళ్లారు. అయితే డ్యూటీలో ఉండాల్సిన మహేశ్వర రెడ్డి తప్పతాగి ఓ మహిళతో సన్నిహితంగా ఉండటాన్ని గమనించి ఫొటో, వీడియోలు తీశారు. ఆఫీసులో ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారంటూ నిలదీశారు. మహేశ్వర్ రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఉన్నతాధికారులకు గ్రామస్థులు ఫిర్యాదు చేశారు.
Also Read : పశ్చిమగోదావరి జిల్లా రావిపాడులో ఉద్రిక్తత.. జవాన్ కుటుంబ సభ్యులకు దళిత సంఘాలకు వాగ్వివాదం