Bhimaa Teaser:ఒక్క టీజర్ తోనే అంచనాలను పెంచేసిన గోపిచంద్ భీమా

గోపిచంద్ భీమా టీజర్ రిలీజయింది. కన్నడ దర్శకుడు హర్ష డైరెక్టన్ లో తెరకెక్కుతోన్న ఈ మూవీలో గోపిచంద్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మాస్ లుక్ లో దర్శనమిస్తున్నాడు. ధర్మాన్ని కాపాడే బ్రహ్మ రాక్షసుడిగా గోపిచంద్ ఎలివేషన్ అదిరింది. ఈ ఒక్క టీజర్ భీమా మూవీపై అంచనాలు పెంచేసింది.

Bhimaa Teaser:ఒక్క టీజర్ తోనే అంచనాలను పెంచేసిన గోపిచంద్ భీమా
New Update

Bhimaa Teaser: మ్యాచో స్టార్ గోపీ చంద్(Gopichandh) ఒక్క హిట్ కోసం చాలా రోజులనుంచి తపిస్తున్నాడు. లక్ష్యం (Lakhsyam) ,లౌక్యం లాంటి హిట్స్ ఇచ్చిన శ్రీవాస్ డైరెక్షన్లో వచ్చిన రామబాణం( Ramabanam) మూవీ ఆశించినంత ఫలితాన్నివ్వకపోవడంతో ఇప్పుడు తన ఆశలన్నీ భీమా మూవీపైనే ఉన్నాయి. అనుకున్నట్లుగానే ఈ రోజు (JAN 05) రిలీజయిన భీమా టీజర్ (Bhimaa Teaser) తో హిట్ వైబ్స్ అందుకుంటున్నాడు.

గోపీచంద్ ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్

కన్నడ దర్శకుడు (Harsha) హర్ష డైరెక్షన్ లో రూపొందుతోన్న భీమా (Bheema) మూవీలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో గోపీచంద్ అలరించనున్నారు. రాక్షసుల మధ్య ధర్మాన్ని కాపాడే బ్రహ్మ రాక్షసుడు అంటూ బ్యాగ్రౌండ్ డైలాగులతో స్టార్ట్ అయిన భీమా టీజర్ చాలా హై ఇంటెన్సన్తో కట్ చేసారు. అత్యున్నత సాంకేతిక విలువలతో చేసిన విఎఫ్ఎక్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. టీజర్ లో హీరో పాత్ర ఎలివేట్ చేసేందుకు భగవద్గీతలో శ్లోకం “యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్, ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే”.. శ్లోకంతో ఆరంభం అయింది. . ఈ రాక్షసులను వేటాడే బ్రహ్మ రాక్షసుడు వచ్చాడు రా.. అంటూ బ్యాక్ గ్రౌండ్ డైలాగ్స్ తో గోపీచంద్ ఎద్దు మీద కూర్చొని చూపిస్తూ ఎలివేషన్ ఇచ్చారు. మొత్తానికి భీమా టీజర్ తోనే ఓ రేంజ్ బజ్ క్రియేట్ చేసి అంచనాలను పెంచేసింది.

ALSO READ:Trivikram Srinivas : దర్శకుడు త్రివిక్రమ్ కు కలిసొచ్చిన కాపీ కథలు

గోలీమార్ , ఆంధ్రుడు తరహాలో భీమాలో పోలీస్ పాత్ర

గోపీచంద్ సరసన ప్రియా భవాని శంకర్, మాళవికశర్మ హీరోయిన్స్ గా నటిస్తోన్న ఈ భీమా  మూవీలో లుక్ వైజ్ చాలా రఫ్ గా కనిపిస్తున్నాడు గోపీచంద్ . పోలీస్ పాత్రలో గోపీచంద్ గతంలో చేసిన గోలీమార్ , ఆంధ్రుడు చిత్రాలు హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు అదే కోవలో వస్తోన్న భీమా సైతం పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో వస్తుండటం,  రిలీజయిన టీజర్ కు ట్రెమండస్ అప్లాజ్ వస్తుండటంతో ఖచ్చితంగా భీమా మూవీ హిట్ కొడుతుందని పక్కాగా కాన్ఫిడెన్స్తో ఉన్నారు మేకర్స్. మరి .. ఫలితం తెలియాలనంటే ( Feb 16) ఫిబ్రవరి 16 వరకు వేచి చూడాలి.

ALSO READ:Vv Vinayak::ఓటిటిలపై సంచలన కామెంట్స్ చేసిన వివి వినాయక్

#priya-bhavani-shankar #malvika-sharma #nimmaa-harsha #malavika #director-harsha #gopichandh #bhimaa-teaser
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe