Google Layoffs : టెక్కీలకు గూగుల్ షాక్...వెయ్యిమంది ఉద్యోగులు తొలగింపు..!!

టెక్ దిగ్గజం గూగుల్ లేఆఫ్స్ లో భాగంగా ఏకంగా వెయ్యి మందిని విధుల నుంచి తొలగించినట్లు సెర్చ్ ఇంజన్ పేర్కొంది. గూగుల్ హార్డ్ వేర్, సెంట్రల్ ఇంజనీరింగ్ టీమ్స్, గూగుల్ అసిస్టెంట్ సహా పలు విభాగాల్లో ఉద్యోగాలకు కంపెనీ కోత పెట్టింది.

New Update
Google: గూగుల్ లో కొత్త ఫీచర్‌ వచ్చేస్తుంది..ఇక వారందరికీ...!

Google Layoffs : టెక్ దిగ్గజం గూగుల్ (Google0లేఆఫ్స్ లో భాగంగా ఏకంగా వెయ్యి మంది(thousand employees)ని విధుల నుంచి తొలగించినట్లు సెర్చ్ ఇంజన్ పేర్కొంది. గూగుల్ హార్డ్ వేర్, సెంట్రల్ ఇంజనీరింగ్ టీమ్స్, గూగుల్ అసిస్టెంట్ సహా పలు విభాగాల్లో ఉద్యోగాలకు కంపెనీ కోత పెట్టింది. లేఆఫ్స్ గురించి ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం బాధపడుతున్నాం..ఈ కష్టమైన నిర్ణయం తీసుకోవల్సి వచ్చిందని బాధిత ఉద్యోగులకు కంపెనీ ఈమెయిల్ ద్వారా తెలిపింది.

ఇక అర్హులైన ఉద్యోగులకు పరిహార ప్యాకేజ్(Compensation package) వర్తింజేస్తామని గూగుల్ తెలిపింది. ఇతర విభాగాల్లో ఎంపిక చేసిన అవకాశాలకు వేటుకు గురైన ఉద్యోగులు తిరిగి అప్లయ్ చేసుకోవచ్చని వెల్లడించింది. కంపెనీలో తిరిగి అవకాశం దక్కని ఎంప్లాయిస్ ఏప్రిల్లో కంపెనీ వదిలిపెట్టాలని చెప్పింది. ఇక 2023లోనే పలు టెక్ సంస్థలు భారీగా ఉద్వాసనలు పలికాయి తాజాగా ఈ ఏడాదిలోనూ అదే ఒరవడిని కొనసాగిస్తున్నాయి.

ఈనెల 15 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 48 టెక్ కంపెనీలు, 7,529మంది ఉద్యోగులను ఇంటికి పంపించాయని లే ఆఫ్ ట్రాకింగ్ వెబ్ సైట్(Lay off tracking website) లే ఆఫ్ ఎఫ్ వైఐ వెల్లడించింది. ఈ ఉద్వాసలు 2024లోనూ కఠిన నిర్ణయాలకు దారితీస్తాయన్న సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. 2023లో 1150కిపైగా టెక్ కంపెనీలు, 2.60లక్షల మందికి పైగా ఉద్యోగాలకు పింక్ స్లిప్ లు ఇచ్చాయి.

ఇది కూడా చదవండి: హ్యుందాయ్ నుంచి కొత్త కాంపాక్ట్ క్రెటా ఫేస్ లిస్ట్ రిలీజ్..డిజైన్ చూస్తే పిచ్చెక్కాల్సిందే..!!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌(Artificial Intelligence) వల్ల ఉద్యోగాలు ఊడడం ఖాయమని.. పలు రంగాలు తీవ్రంగా ప్రభావితమవుతాయని సర్వత్రా భయాలు నెలకొన్న విషయం తెలిసిందే. AI అడ్వెన్స్‌కి చేరే సమయానికి ఎక్కువగా ప్రభావితమయ్యే ఉపాధి రంగాలలో ఆఫీస్ సపోర్ట్, కస్టమర్ సర్వీస్, ఫుడ్ సర్వీస్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఈ ఫిల్డ్స్‌లో ప్రస్తుతం జాబ్స్ చేస్తున్న వాళ్లు ముందునుంచే జాగ్రత్తగా ఉంటూ.. టెక్‌ నాలెడ్జ్‌ని అప్‌డేట్‌ చేసుకోవడం.. AIకి సంబంధించి పలు కోర్సులు నేర్చుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఉద్యోగాల మార్పు వల్ల తక్కువ సంపాదన ఉన్నవాళ్లు వేరే వృత్తి రంగాలకు వెళ్లేందుకు కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంటుందని నివేదికలు కూడా స్పష్టం చేస్తున్నాయి. ఇదే సమయంలో IMF చీఫ్ ఏఐ కారణంగా ఉద్యోగాలు ఊడడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. 

40శాతం ఉద్యోగాలు ఊడతాయ్:
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ భద్రతకు ప్రమాదాలను కలిగిస్తుందన్నారు అంతర్జాతీయ ద్రవ్య నిధి(IMF) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా. అయితే ఫ్లాగ్జింగ్ ఉత్పాదకత స్థాయిలను పెంచడానికి, ప్రపంచ వృద్ధికి ఇంధనం ఇవ్వడానికి AI అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుందని తెలిపారు. అంటే ప్రొడక్టవిటీ పెరుగుతుంది కానీ ఉద్యోగాలు పోతాయన్నమాట. అధునాతన ఆర్థిక వ్యవస్థల్లో 60 శాతం ఉద్యోగాలపై AI ప్రభావం చూపుతుందని తెలిపారు. అయితే అభివృద్ధి చెందుతున్న దేశాలలో AI తక్కువ ప్రభావాన్ని చూపుతుందని అంచనా వేశారు. ఓవరాల్‌గా ప్రపంచవ్యాప్తంగా 40 శాతం ఉద్యోగాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుందని IMF నివేదికను ఉటంకిస్తూ జార్జివా చెప్పారు.

ఇది ఫాలో అవ్వండి:
ట్రెండ్‌కి తగ్గట్టే మనిషి తన ఆలోచనా తీరును మార్చుకోవాలి. లేకపోతే కాలం అందనంతా దూరం వెళ్లిపోతుంది కానీ మనం మాత్రం ఇంకా వెనక్కే ఉండిపోతాం. అందుకే లేటెస్ట్ టెక్‌ ట్రెండ్స్‌ ఫాలో అవుతూ ఉండాలి. ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ జపం చేస్తుండగా.. దీనికి సంబంధించి వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలంటున్నారు టెక్‌ నిపుణులు. కంప్యూటర్ల ఎంట్రీ సమయంలోనూ జాబ్స్‌ పోతాయన్న భయం ఉండేదని.. అయితే ప్రస్తుతం ఐటి సెక్టర్‌లో ఉన్న జాబ్స్‌.. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ఇస్తున్న శాలరీ మరే ఇతర ఫిల్డ్‌లోనూ లేదన్న విషయం మరిచిపోవద్దు.. ఇప్పుడు ఐటీ ఎంప్లాయిస్‌ చేసే జాబ్స్‌ రోబోలు చేస్తున్నాయని.. ఏఐతో ఉద్యోగాలు పోతాయని భయం అవసరం లేదని.. టెక్నాలజీ మార్పులను గమనిస్తూ వాటిలో నైపుణ్యం పెంచుకునేలా ముందునుంచే జాగ్రత్తగా ఉంటే మంచిదని చెబుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు