Google: మరోసారి గూగుల్ షాక్‌..వందల మంది పై వేటు

తాజాగా గూగుల్‌ మరోసారి ఉద్యోగులకు లే ఆఫ్స్‌ ప్రకటించింది. ఈసారి వందలాది ఉద్యోగుల్ని తొలగించినట్లు పేర్కొంది.

JOBS: ఇంటర్ పాసైతే చాలు..గూగుల్లో ఉద్యోగం మీదే..పూర్తి వివరాలివే..!!
New Update

కరోనా(Covid) వచ్చిన తరువాత ఐటీ రంగంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రముఖ కంపెనీలు , పేరున్న కంపెనీలు కూడా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఎప్పుడూ ఏం జరుగుతుందో తెలియక ఐటీ ఉద్యోగులు చాలా మంది కంటి మీద కునుకు లేకుండా ఉంటున్నారు. అమెజాన్‌(Amazon), మైక్రోసాఫ్ట్‌, ట్విట్టర్‌, మెటా, గూగుల్‌(Google)వంటి దిగ్గజ సంస్థలన్ని కూడా పెద్ద మొత్తంలో ఉద్యోగుల్ని పీకి ఇంటికి పంపిస్తున్నాయి.

కొద్ది రోజులుగా ఈ విషయం నెమ్మదించినప్పటికీ..మళ్లీ తిరిగి ఉద్యోగుల్ని ఏకి పారేసే పని లో పడ్డాయి దిగ్గజ కంపెనీలు. తాజాగా గూగుల్‌ మరోసారి ఉద్యోగులకు లే ఆఫ్స్‌ ప్రకటించింది. ఈసారి వందలాది ఉద్యోగుల్ని తొలగించినట్లు పేర్కొంది. వీరిలో చాలా మంది గ్లోబల్ రిక్రూట్ మెంట్‌ టీమ్‌ వారే ఉన్నట్లు సమాచారం. కొత్తగా ఎవర్ని తీసుకోవడం లేదని కూడా తెలిపింది.

గత మూడు నెలలుగా పోల్చుకుంటే..లే ఆఫ్స్ విధించిన అతి పెద్ద టెక్‌ కంపెనీ గూగుల్‌ అల్ఫాబెట్‌ నే కావడం విశేషం. ఈ ఏడాది ప్రారంభంలో మెటా, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌ వంటి దిగ్గజ సంస్థలు 2023 ప్రారంభంలో ఉద్యోగుల్ని తొలగించాయి. ఇంతకు ముందు కూడా అల్ఫాబెట్‌ సుమారు 12 వేల మంది ఉద్యోగుల్ని తొలగించి ఇంటికి పంపింది.

కొన్ని సంస్థలు అయితే ఉద్యోగులకు ముందు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే వారిని ఉద్యోగుల నుంచి తొలగించి ఇంటికి పంపేశారు. కొందరు సెలవులు ఎంజాయ్‌ చేస్తుండగా..మరికొందరు మీటింగ్ లో ఉండగా..పీకేసీ ఇంటికి పంపేశాయి. చాలా మంది ఉద్యోగులు తమ బాధను సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు కూడా.

కరోనా సమయంలో ఇంటి వద్ద నుంచి పని చేయడానికి కొన్ని కంపెనీలు అవకాశాన్ని ఇచ్చాయి. ఈ క్రమంలో ఉద్యోగులు ఇప్పుడు కూడా ఇంటి వద్ద నుంచే పని చేయడానికి ఛాన్స్‌ అడుగుతుంటే కంపెనీలు అందుకు ఒప్పుకోవడం లేదు.దానితో పాటు జీతాలు కూడా పెంచట్లేదు. అంతేకాకుండా ఎటువంటి బోనస్‌ లు కూడా ఇవ్వడం లేదు.

ఉద్యోగుల్ని తొలగించడం వల్ల కంపెనీలో వ్యయాలు తగ్గించుకోవడంతో పాటు..ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా తప్పించుకోవచ్చని సంస్థలు అనుకుంటున్నాయి.

#google #layoffs
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe