Google Maps:గూగుల్ మ్యాప్స్ ను తలదన్నే యాప్ మరొకటి లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఎవరు ఎక్కడికి వెళ్ళాలన్నా ౠదారపడే ఒకే ఒక్క మ్యాప్ యాప్ గూగుల్. దీని తరువాత ఇలాంటి చాలా వచ్చినా నిలబడలేకపోయాయి. దీనిరి తోడు గూగుల్ మ్యాప్స్ తనను తాను ఎప్పుటికప్పుడు మెరుగుపర్చుకుంటూ...కొత్త ఫీచర్స్లను యాడ్ చేసుకుంటూ దూసుకుపోతోంది. తాజాగా మరో కొత్త ఫీచర్‌ను ఇంట్రడ్యూస్ చేసింది.
Also read:16 ఏళ్ళ బాలి మీద వర్చువల్ రేప్..ప్రపంచంలోనే మొట్టమొదటి కేసు
మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే..రూట్ తెలియకపోతే వెంటనే అక్కడ ఉంటున్న వారిని లొకేషన్ షేర్ చేయమని అడుగుతూంటాం. అవతలి వాళ్ళు వాట్సాప్‌లో లొకేషన్ షేర్ చేస్తారు. ఒకవేళ ఇందులో కనుక వెళ్ళకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కానీ ఇక మీదట అలాంటి ప్రాబ్లెమ్స్ రావని అంటోంది గూగుల్. రూట్ మ్యాప్‌పై రియల్ టైం లొకేషన్ షేరింగ్ ఫీచర్‌ను అందిస్తుంది. ఇప్పటివరకు రియల్ టైం లొకేషన్ షేర్ చేయాలంటే తప్పనిసరిగా వాట్సప్ వంటి మరో యాప్ మీద ఆధార పడాల్సిందే. కానీ ఇక మీదట నుంచి డైరెక్ట్‌గా గూగుల్ మ్ఆప్స్ నుంచే లొకేషన్ షేర్ చేసేయవచ్చును.
ఈ ఫీచర్‌ను ఉపయోగించుకునేందుకు గూగుల్ మ్యాప్స్ యాప్‌లో లాగిన్ అవ్వాలి. ఫ్రొఫైల్ అకౌంట్‌పై క్లిక్ చేసి అందులో లొకేషన్ షేరింగ్ ఆప్షన్ ఎంచుకోవాలి. స్క్రీన్‌పై కనిపిస్తున్న న్యూ షేర్‌పై క్లిక్ చేసి సమయాన్ని సెట్ చేసుకోవచ్చు. లేదా ‘అంటిల్ యు టర్న్ దిస్ ఆఫ్’ ఆప్షన్ ఎంచుకొని కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకొని మెసేజ్ పంపించాలి.