Google :గూగుల్ నుంచి కిరాక్ మొబైల్ వచ్చింది మావా.. ఫీచర్లు చూస్తే కొనకుండా ఉండలేరు ప్రముఖ గూగుల్ (Google) సంస్థ ఇటీవల ఆవిష్కరించిన ఫ్లాగ్ షిప్ ఫోన్లు గూగుల్ పిక్సెల్ 8(Google pixel 8), పిక్సెల్ 8 ప్రో (Pixel 8 pro) భారత్ మార్కెట్లోకి వచ్చేశాయి. By Bhavana 05 Oct 2023 in బిజినెస్ Latest News In Telugu New Update షేర్ చేయండి Google launches Pixel 8 Series Mobiles: ప్రముఖ గూగుల్ (Google) సంస్థ ఇటీవల ఆవిష్కరించిన ఫ్లాగ్ షిప్ ఫోన్లు గూగుల్ పిక్సెల్ 8(Google pixel 8), పిక్సెల్ 8 ప్రో (Pixel 8 pro) భారత్ మార్కెట్లోకి వచ్చేశాయి. చూడాటానికి పాత ఫోన్లు లాగా ఉన్నప్పటికీ సీపీయూ, కెమెరాలను కాస్త అప్ డేట్ చేశారు. ఈ ఫోన్ల డిజైన్, బిల్డప్ క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి. ఇందులో టెన్సార్ జీ3 చిప్, 256 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజీ ఉంది. దీంతో ఈ ఫోన్లలో ఆండ్రాయిడ్ 14 ఓఎస్ (Android 14 OS)ను ఉపయోగించి తయారు చేశారు. ఈ రెండింటిలో కూడా బ్లర్ అయిన ఫోటోలను అన్ బ్లర్, లైవ్ ట్రాన్స్ లేట్ వంటి ఏఐ ఫీచర్లు పొందుపరిచారు. సుమారు ఏడు సంవత్సరాల పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ గ్యారెంటీ ఉంది. గూగుల్ పిక్సెల్ 8 ధర ఇండియాలో రూ.75,999 రూపాయలుగా నిర్ణయించారు. ఇది 128 జీబీ సింగిల్స్ స్టోరేజీ మోడల్ లో అందుబాటులో వస్తుంది. హేజల్, గూగుల్ పిక్సెల్ 8 ప్రో 128 జీబీ స్టోరేజీ ధర రూ. 1,06,999 మాత్రమే. ఇందులో బే, ఒబ్సిడియాన్, పోర్సెలిన్ లలో లభిస్తున్నాయి. ఫ్లిప్ కార్ట్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. బుధవారం నుంచి వీటికి ముందుగానే ఆర్డర్లు కూడా మొదలయ్యాయి. Also Read: ఏటీఎం నుంచి చిరిగిన నోటు వచ్చిందా.. వెంటనే ఇలా చేయండి.. గూగుల్ తొలిసారి ఈ నెల 12న స్మార్ట్ వాచ్..పిక్సెల్ వాచ్ 2 నుంచి భారత్ లో లాంచ్ చేస్తోంది. దీన ధర రూ. 39,900. పిక్సల్ ఫోన్ల పై గూగుల్ ఆకర్షణీయమైన ఆఫర్లను కూడా ప్రకటించింది. కొన్ని బ్యాంకు కార్డుల ద్వారా పిక్సెల్ 8 కొనుగోలు చేస్తే కనుక సుమారు రూ.8 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. ఎక్స్‌చేంజ్ ఆఫర్ పై రూ. 3 వేల రాయితీ కూడా లభిస్తుంది. పిక్సెల్ 8 ప్రో కొనుగోలు పై రూ. 9 వేలు, మార్చుకోవాలనుకుంటే రూ. 4 వేలు రాయితీ లభిస్తుంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి కొనుగులు చేస్తే భారతీయ కొనుగోలు దారులు పిక్సెల్ వాచ్ 2ను 19,999 కే దక్కించుకోవచ్చు. దీంతో పాటు పిక్సెల్ బడ్స్ ప్రోను రూ. 8,999కే సొంతం చేసుకోవచ్చు. ఈ రెండు ఫోన్లు కూడా డ్యూయల్ సిమ్ తో వస్తున్నాయి. ఆండ్రాయిడ్ 14 ఓఎస్. పిక్సెల్ 8 లో 6.2 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ ఓలెడ్ స్క్రీన్లతో 90 హెర్డ్స్ రీ ఫ్రెష్ రేట్ తో రాగా, పిక్సెల్ 8 ప్రోలో 6.7 అంగుళాల క్వాడ్ హెచ్ డీ రిజల్యూషన్ , 120 హెర్ట్జ్ రీ ఫ్రెష్ తో వస్తోంది. గూగుల్ నోనా కోర్ టెన్సార్ జీ 3 చిప్ సెట్, టైటాన్ ఎం2 సెక్యూరిటీ చిప్ ఉపయోగించారు. పిక్సెల్ 8 లో 8 జీబీ ర్యామ్, పిక్సెల్ 8 ప్రోలో 12 జీబీ ర్యామ్ ఉపయోగించారు. పిక్సెల్ 8, 8 ప్రో ఫోన్లు 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వస్తున్నాయి. పిక్సెల్ 8 లో 12 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉపయోగించగా, 8 ప్రోలో 64 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ప్రో మోడల్‌లో మూడో సెన్సార్‌గా 48 ఎంపీ టెలీఫొటో కెమెరాను వాడారు. సెల్ఫీల కోసం రెండు ఫోన్లలోనూ ముందువైపు 11 మెగాపిక్సల్ కెమెరా ఉంది.రెండు ఫోన్లలోనూ ఇన్‌బిల్ట్‌గా 256 జీబీ ఉంది.బ్లూటూత్ 5.3, జీపీఎస్, వై-ఫై 6ఈ, 5జీ, 4జీ ఎల్‌టీటీ, ఎన్ఎఫ్‌సీ కలిగిన ఈ ఫోన్లలో యూఎస్ బీ టైప్ - సీ పోర్టును వాడారు. వైర్‌లెస్ చార్జింగ్ కూడా చేసుకోవచ్చు. Also Read: Amazon Great Indian Festival Sale: ఈ సాంసంగ్ 5జీ ఫోన్ పై రూ.10 వేల డిస్కౌంట్.. ఫైనల్ ధర ఎంత తక్కువంటే? #google #bharat #goole-pixel-8 #google-pixel-8-pro #google-launches-pixel-8 #google-pixel-8-mobile మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి