Google: గూగుల్ లో కొత్త ఫీచర్‌ వచ్చేస్తుంది..ఇక వారందరికీ...!

ఇతర మెసేజింగ్ యాప్‌లకు పోటీగా గూగుల్ తన యాప్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేపనిలో పడింది. ఇప్పటికే వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌.. వంటి యాప్‌లకు ‘ఎడిట్‌’ ఆప్షన్‌ అందుబాటులో ఉండగా.. ఇప్పుడు గూగుల్‌ కూడా ‘‘ఎడిట్‌’’ ఆప్షన్‌ను తన యాప్‌నకు జోడిస్తోంది..

New Update
Google: గూగుల్ లో కొత్త ఫీచర్‌ వచ్చేస్తుంది..ఇక వారందరికీ...!

Google Messages New Feature to Edit RCS Chats: ప్రస్తుత టెక్నాలజీ యుగంలో సోషల్‌ మీడియా యాప్‌ లో రోజుకో కొత్త ఫీచర్‌ తో సత్తా చాటుతున్నాయి. వినియోగదారుల ఆలోచనలు, అభిరుచులకు తగ్గట్లుగా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి వస్తున్నాయి. అయితే, ఇతర మెసేజింగ్ యాప్‌లకు పోటీగా గూగుల్ తన యాప్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేపనిలో పడింది.

ఇప్పటికే వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌.. వంటి యాప్‌లకు ‘ఎడిట్‌’ ఆప్షన్‌ అందుబాటులో ఉండగా.. ఇప్పుడు గూగుల్‌ కూడా ‘‘ఎడిట్‌’’ ఆప్షన్‌ను తన యాప్‌నకు జోడిస్తోంది.. దీంతో.. ఇకపై ఆర్సీఎస్‌ చాట్‌ ద్వారా పంపే సందేశాలనూ ఎడిట్‌ చేసే అవకాశాన్ని గూగుల్‌ తన యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది గూగుల్..గూగుల్‌ తన సందేశాల యాప్‌లో RCS చాట్‌ల కోసం సవరణ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది, ఇది 15 నిమిషాల విండోలో అక్షరదోషాలను (ఎడిట్‌) సరిచేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.

Also Read: ప్రైవేట్‌ పార్ట్స్ లో కేజీ బంగారాన్ని దాచి స్మగ్లింగ్‌ చేస్తున్న ఎయిర్‌ హోస్టెస్‌!

ఆర్సీఎస్‌ సాంప్రదాయ ఎస్ఎంఎస్/ఎంఎంఎస్ టెక్స్టింగ్‌ను మెరుగుపరుస్తుంది.. తెలియని వారికి, ఆర్సీఎస్‌ అంటే రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్, ఇది సాంప్రదాయ ఎస్ఎంఎస్/ఎంఎంఎస్ టెక్స్టింగ్‌కి అప్‌గ్రేడ్. వాట్సాప్‌ లేదా ఐ మెసేజ్ వంటి యాప్‌లతో వినియోగదారులు ఇప్పటికే పొందుతున్న సేవలకు అనుగుణంగా మెసేజింగ్‌ను మరింత గొప్పగా చేసే అనేక ఫీచర్‌లను ఇది అందిస్తుంది.

గూగుల్‌ తీసుకొచ్చిన ఈ సరికొత్త ఫీచర్‌ తో RCS ద్వారా పంపే ఏ మెసేజ్‌నైనా ఎడిట్‌ చేసుకోవచ్చు.. అయితే, అందుకోసం మనం పంపిన మెసేజ్‌పై లాంగ్‌ ప్రెస్‌ చేస్తే.. పాప్‌ అప్‌ మెనూ ఓపెన్‌ అవుతుంది. అందులో ‘‘ఎడిట్‌’’ ఆప్షన్‌ను ఎంచుకుని సందేశంలోని తప్పులు సరిచేసుకోవాల్సి ఉంటుంది. ఇక, ఇలా సవరించిన మెసేజ్‌కు కింద చివరన ఎడిటెడ్‌ అని స్పష్టంగా కనిపిస్తుంది.

కానీ, ఆ సందేశాన్ని పంపిన 15 నిమిషాల్లోనే ఎడిట్‌ చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఎడిట్‌ ఆప్షన్‌ కనిపించకుండా పోతుంది. ఈ ఎడిటింగ్ ఫీచర్ ప్రస్తుతం ఆర్సీఎస్‌ చాట్‌లకు పరిమితం చేయబడిందని గమనించాలి.. ప్రామాణిక ఎస్ఎంఎస్/ఎంఎంఎస్ సందేశాలకు ఇప్పటికీ ఎడిటింగ్ చేసుకునే అవకాశం లేదు.

Advertisment
తాజా కథనాలు