Sundar Pichai: గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌పై తీవ్ర విమర్శలు చేసిన మాజీ ఉద్యోగి..

గూగుల్ సీఈఓ సుందర్‌ పిచాయ్‌పై ఆ సంస్థలో పనిచేసిన ఓ మాజీ ఉద్యోగి తీవ్రంగా విమర్శలు చేశారు. విజనరీ లేని లీడర్‌షిప్, నైతిక ప్రమాణాలు దిగజారిపోయాయంటూ సుందర్‌ పిచాయ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. స్పష్టమైన వైఖరితో ఉన్న వారికి అధికారమిస్తే.. కంపెనీ పూర్వ వైభవానికి వస్తుందన్నారు.

Sundar Pichai: గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌పై తీవ్ర విమర్శలు చేసిన మాజీ ఉద్యోగి..
New Update

అల్పాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్‌పై గూగుల్ మాజీ ఉద్యోగి ఒకరు ఘాటుగా విమర్శలు చేయడం చర్చనీయాంశమవుతోంది. దార్శనిక నాయకత్వం లేకపోవడం వల్లే కంపెనీ క్షీణతకు దారి తీసిందని విమర్శలు చేశారు. విజనరీ లేని లీడర్‌షిప్ ఉండటం, నైతిక ప్రమాణాలు దిగజారిపోయాయంటూ సుందర్‌ పిచాయ్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎగ్జిక్యూటివ్‌లు, సిబ్బంది మధ్య పారదర్శకతను గూగుల్ నాశనం చేస్తోందంటూ ఆ మాజీ ఉద్యోగి ఆరోపించారు. ఒకప్పుడు సంస్థ కోసం, వినియోగదారల ప్రయోజనాల కోసం తీసుకునేటటువంటి నిర్ణయాలు ఇప్పుడు మారిపోయానని అన్నారు. ఆ నిర్ణయాలు తీసుకునేవారు వారి ప్రయోజనాల కోసమే తీసుకుంటున్నారని మండిపడ్డారు.

దాదాపు గూగుల్‌లో 18 ఏళ్ల పాటు పనిచేసిన తాను ఈ నెలలో కంపెనీకి రాజీనామ చేశానని ఇయాన్ హక్సన్‌ అనే మాజీ ఉద్యోగి తెలిపారు. సంస్థలో భారీగా ఉద్యోగాల తొలగింపు, నైతిక ప్రమాణాలు వంటి అంశాలను తన పోస్ట్‌లో వివరించారు. విజనరీ లేని సుందర్ పిచాయ్ నాయకత్వంలో గూగుల్ కల్చర్ క్షీణించిపోయిందని విమర్శించారు. కంపెనీలో చేరిన తొలిరోజులు చాలా బాగుండేవని.. ఈ విషయంలో తాను అదృష్టవంతుడినని తెలిపారు. సంస్థలో పనిచేసే కీలక ఎగ్జిక్యూటివ్‌లు సిబ్బందితో పారదర్శకంగా, నిజాయతీగా ఉండేవారని.. ప్రయోగాలకు ప్రోత్సహమిచ్చేవారని తెలిపారు.

Also read: 600 రూపాయల శాండ్‌ విచ్‌ కి 6 లక్షల టిప్‌ ఇచ్చిన మహిళ..పొరపాటు తెలిసి లబోదిబో!

కానీ ఇప్పుడు గూగుల్‌లో కంపెనీ విజన్ ఏంటో వివరించే వాళ్లు ఎవరైనా ఉన్నారా అనే సందేహాన్ని కూడా ఆయన ప్రస్తవించారు. శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియాలో థెరపిస్ట్‌లతో మాట్లాడితే.. వారు తమ గూగుల్ క్లయింట్లందరూ అసంతృప్తిగానే ఉన్నారనే విషయం అర్థమవుతుందని రాసుకొచ్చారు. ఈ సమస్యంతా సుందర్ పిచాయ్‌ విజనరీ లేని నాయకత్వం వల్లే వచ్చిందని.. అసలు ఆయనకు ప్రారంభ గూగుల్‌ ప్రమాణాలను పాటించడంపై ఏ మాత్రం ఆసక్తి లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీర్ఘకాలిక, స్పష్టమైన వైఖరితో ఉన్న వారికి బాధ్యతలు అప్పగిస్తే, కంపెనీ పూర్వ వైభవానికి వస్తుందని వ్యాఖ్యానించారు. ఇదిలాఉండగా హిక్సన్‌ చేసిన వ్యాఖ్యలపై గూగుల్‌ ఇంతవరకు స్పందించలేదు.

#google-news #google-ceo #sundar-pichai #google-employee #telugu-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe