Google Doodle: గూగుల్ 25 వ వార్షికోత్సవం..ప్రత్యేక డూడుల్!

గత రాత్రి 12 గంటలు దాటిన తరువాత గూగుల్ తన ప్రత్యేకమైన డూడుల్ ని పెట్టుకుంది.Google అనే ప్లేస్ లో 25 వ వార్షికోత్సవాలు గురించి తెలియజేస్తూ G25gle అనే అక్షరాలు స్క్రీన్‌పై కనపడుతున్నాయి. ప్రస్తుతం ఈ డూడుల్ అందరినీ ఆకట్టుకుంటోంది.

New Update
Google Doodle: గూగుల్ 25 వ వార్షికోత్సవం..ప్రత్యేక డూడుల్!

గూగుల్‌(Google)...ప్రస్తుత ప్రపంచంలో ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. పెద్ద వారి నుంచి చిన్న పిల్లల వరకు అందరికీ గూగుల్ తమ శరీరాల్లో ఓ భాగం అయిపోయింది. నెట్ లో ఏదైనా శోధించాలంటే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది గూగుల్‌. గూగుల్‌ లో దొరకని సమాచారం ఏది ఉండదు.

విద్య, వైద్యం, సినిమా, రాజకీయాలు, పాటలు, ఆటలు ఇలా అన్ని కూడా గూగుల్‌ లో దొరుకుతాయి. ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్లాలన్న కూడా గూగుల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలా ప్రతి చిన్న విషయానికి గూగుల్ మీద ఆధారపడటం అలవాటైపోయింది. ఏ ప్రత్యేక సందర్భం ఉన్న సరే గూగుల్‌ ప్రత్యేక డూడుల్స్ ను తయారు చేస్తుంది.

ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం గూగుల్ 25 వ వార్షికోత్సవం. అంటే గూగుల్ పుట్టి నేటికి 25 ఏళ్లు అయ్యిందనమాట. ఈ సందర్భంగా గూగుల్‌ డూడుల్ ప్రత్యేకంగా సెలబ్రేట్‌ చేసుకుంటుంది. గత రాత్రి 12 గంటలు దాటిన తరువాత గూగుల్ తన ప్రత్యేకమైన డూడుల్ ని పెట్టుకుంది.

Google అనే ప్లేస్ లో 25 వ వార్షికోత్సవాలు గురించి తెలియజేస్తూ G25gle అనే అక్షరాలు స్క్రీన్‌పై కనపడుతున్నాయి. ప్రస్తుతం ఈ డూడుల్ అందరినీ ఆకట్టుకుంటోంది. అమెరికాకు చెందిన లారీ పేజ్, సర్జీ బ్రిన్ పీహెచ్‌డీ విద్యార్థులుగా ఉన్న సమయంలో గూగుల్ ను స్థాపించారు.

రోజురోజుకి గూగుల్ అనేక అంశాల్లో మార్పులు చెందుతూ..నేడు ప్రపంచంలో వందకు పైగా భాషల్లో నిత్యం కొన్ని వేల శోధనలు జరుగుతుంటాయి. నేడు ప్రపంచంలోనే టాప్ కంపెనీల్లో ఒకటిగా గూగుల్‌ నిలిచింది. ప్రస్తుతం ఈ సంస్థకు సుందర్ పిచాయ్‌ సీఈఓ గా ఉన్నారు. 2015లో ఆయన గూగుల్‌ బాధ్యతలను స్వీకరించారు.

Advertisment
తాజా కథనాలు