Duet AI: గూగుల్‌ మీట్‌కు మీ బదులు ఏఐ.. మీ వర్క్‌, నోట్స్‌ కూడా అదే చేసేస్తుంది భయ్యా!

గూగుల్‌ నుంచి మరో అదిరే ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌(AI) సేవలను ఎక్కువగా ఉపయోగించుకోని వినియోగదారులకు మరింత దగ్గరవుతుంది గూగుల్‌. 'గూగుల్‌ డ్యూయెట్' అనే ఫీచర్‌తో మీ బిజీ టైమ్‌లో మీ బదులుగా మీటింగ్‌లకు AI అటెండ్‌ అవుతుంది. అయితే ఈ ఫీచర్‌ను బాధ్యతాయుతంగా ఉపయోగించడం ముఖ్యం. మీటింగ్‌కి అటెండ్‌ అయ్యే టైమ్‌ ఉండి కూడా 'ఏఐ అసిస్టెంట్‌ని'ని పంపితే అది తర్వాత మీ కెరీర్‌కి మైనస్‌ కావచ్చు.

Duet AI: గూగుల్‌ మీట్‌కు మీ బదులు ఏఐ.. మీ వర్క్‌, నోట్స్‌ కూడా అదే చేసేస్తుంది భయ్యా!
New Update

Google announces Duet AI for Meets: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌(AI) సేవలను గూగుల్(Google) పెంచుకుంటూ పోతోంది. వినియోగదారులను ఎప్పటికప్పుడు థ్రిల్ చేస్తుండే ఈ టెక్ దిగ్గజం మరింత మెరుగైన ఫీచర్లును తీసుకొస్తోంది. అనేక కొత్త ఫీచర్లకు ఏఐ(AI)ని జోడిస్తోంది. గూగుల్‌ నుంచి వచ్చిన తాజా AI డెవలప్‌మెంట్‌ ఇది. వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫారమ్ మీట్ కోసం 'డ్యూయెట్ AI'ని గూగుల్‌ తీసుకొస్తోంది. ఈ కొత్త AI సాధనం వినియోగదారులకు బదులుగా మీటింగ్‌లకు, నోట్స్‌ రాసుకోవడానికి ఉపయోగపడుతుంది. డ్యూయెట్ AIని పరిచయం చేస్తూ, ఈ AI మీట్‌తో సహా గూగుల్‌ వర్క్‌ స్పేస్‌ అంతటా రోజువారీ పనులలో వినియోగదారులకు సహాయపడుతుందని కంపెనీ ప్రకటించింది.

కాస్త రిలెక్స్‌ అవొచ్చు:
'గూగుల్‌ డ్యూయెట్ ఏఐ' వినియోగదారుల తరపున సమావేశానికి హాజరవ్వడం అనేది అతిపెద్ద ఫీచర్‌. ఈ ఫీచర్ మీటింగ్‌కు చేరుకోలేని లేదా బ్యాక్-టు-బ్యాక్ ఆన్‌లైన్ సెషన్‌ల నుంచి గ్యాప్‌ తీసుకోవాలనుకునే యూజర్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్‌ను ఉపయోగించడానికి, వినియోగదారులు మీటింగ్ ఇన్‌విటేషన్‌లో "నా కోసం హాజరు(Attend for me)" అని బటన్‌ను క్లిక్ చేయవచ్చు. ఈ AI ఫీచర్ మీటింగ్‌లకు హాజరు కావాల్సిన వ్యక్తులకు సహాయ పడుతుంది. వ్యక్తిగతంగా మనం అక్కడ ఉండాల్సిన పనిలేదు. ఇక మీటింగ్‌ ఆహ్వానంపై బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా, వినియోగదారులు ఏం చర్చించాలనుకుంటున్న దాని గురించి డ్యూయెట్ AI కొంత సమాచారాన్ని రూపొందించుకుంటుంది. మీటింగ్‌లో పాల్గొన్న వారందరికీ ఇది కనిపిస్తుంది.

అతిగా ఆధారపడవద్దు:
గూగుల్‌ డ్యూయెట్ AI మీటింగ్ నోట్స్ గేమ్ ఛేంజర్ కావచ్చు. రియల్ టైమ్‌లో నోట్స్ తీసుకోవడం, సమ్మరిని రూపొందించడం ద్వారా.. డ్యూయెట్ AI నోట్-టేకింగ్ మీ పనిభారం నుంచి విముక్తి చేస్తుంది. అయితే ఈ ఫీచర్‌ను బాధ్యతాయుతంగా ఉపయోగించడం ముఖ్యం. మీరు నిజంగా హాజరు కావాల్సిన సమావేశాలను తప్పించుకోవడానికి మీరు దీన్ని ఉపయోగిస్తే అది ఇతర వ్యక్తులపై భారం పడుతుంది. ఈ ఫీచర్ దుర్వినియోగం కాకుండా గూగుల్ స్వయంగా జాగ్రత్తలు తీసుకుంది. మీటింగ్‌లోని ప్రతి ఒక్కరూ తమ AI అసిస్టెంట్‌ని పంపితే మీట్‌ కాల్ ఆటోమేటిక్‌గా ముగుస్తుంది. ఎందుకంటే పని తప్పించుకోవడానికి AI అసిస్టెంట్‌ని పంపడం వేరు.. నిజంగానే పని బిజీ షెడ్యూల్‌ ఉండి ఏఐ సర్వీస్‌ని వాడుకోవడం వేరు. మీటింగ్‌కి అటెండ్‌ అయ్యే టైమ్‌ ఉండి కూడా 'ఏఐ'ని పంపితే అది తర్వాత మీ కెరీర్‌కి మైనస్‌ కావచ్చు. మనం స్వయంగా చేయాల్సిన పనులకు టెక్నాలజీపైన అతిగా ఆధారపడడం కరెక్ట్ కాదు. ఇది లాంగ్‌ టర్మ్‌లో మీ కెరీర్‌పై నెగిటివ్‌ ఎఫెక్ట్ చూపిస్తుంది..ఇది నోట్ చేసుకోండి..!

ALSO READ: స్టీవ్ జాబ్స్ రాసిన ప్రకటన లేఖ ఎంతకు అమ్ముడుపోయిందో తెలుసా?

#artificial-intelligence #google-meet
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe