తిరుమల తిరుపతి స్వామి వారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వ తేదీ వరకు కూడా వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, శ్రీవాణి దర్శన టికెట్లు, గదుల కోటాను నవంబర్ 10 న టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.
రోజుకి 22, 500 చొప్పున పది రోజులకు 2.25 లక్షల టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లను విడుదల చేయనుంది. రోజుకి 2 వేల చొప్పున 20 వేల టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. స్వామి దర్శనానికి రావాలనుకునే వారు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ అధికారులు తెలిపారు.
డిసెండర్ 22న వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో 4.25 లక్షల టైంస్లాట్ సర్వ దర్శన టికెట్లను జారీ చేయనున్నట్లు టీటీడీ అధికారులు వివరించారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం వేచి చూస్తున్న యాత్రికులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని టీటీడీ తెలిపింది.ప్రస్తుతం తిరుమల స్వామి వారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు.
Also read: అతిగా ఆలోచిస్తున్నారా.. అయితే ఈ చికిత్స తీసుకోవాల్సిందే..