Telangana Rythu Bandhu : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు అవుతోంది. కానీ ఇప్పటి వరకు రైతు బంధు పడలేదని చాలా మంది రైతులు వాపోతున్నారు. వాస్తవానికి డిసెంబర్ రెండో వారం నుంచే రైతు బంధు పంపిణీ అనేది మొదలు అయ్యింది. కానీ ముడు ఎకరాలు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్నవారికి ఇంకా డబ్బులు జమ కాలేదు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.ఆలస్యం అయినా సరే ఇచ్చిన ప్రతి హామీని ఖచ్చితం అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. గతంలోనూ రైతు బంధు డబ్బులు అందరికీ పడేందుకు కొంత సమయం పట్టేదని..ఇప్పుడు కూడా అదే జరుగుతుందని రేవంత్ రెడ్డి అన్నారు.
2018లో యాసంగి పంట రైతుబంధు వేసేందుకు 5 నెలల సమయం పట్టిందని ముఖ్యమంత్రి అన్నారు. 2020లో జనవరి 28న మొదలుపెట్టి..అక్టోబర్ 23 వరకు పూర్తి చేశారు. అప్పుడు ఏకంగా 9 నెలల సమయం పట్టిందన్నారు. 2021,2022లో కూడా యాసంగి పంటకు రైతు బంధు వేసేందుకు నాలుగు నెలల సమయం పట్టిందని గుర్తు చేశారు.
ఇది కూడా చదవండి : పార్లమెంటు క్యాంటీన్‌లో తోటి ఎంపీలతో మోదీ లంచ్..రాగి లడ్డూలు తిన్న ప్రధాని..!!
ఇప్పుడు మేం అధికారంలోకి వచ్చి 6రోజులు కూడా కాలేదు. అప్పుడే మాపై విమర్శలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రైతుబంధు ఇంకా పడలేదని రైతులను రెచ్చగొడుతున్నారన్నారు. వందరోజుల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని చెప్పాము..వాటిని ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి : టీఎస్ ఈ సెట్, లా సెట్ షెడ్యూల్ విడుదల