Reopening of Amrit Udyan : రాష్ట్రపతి భవన్ ఆత్మగా వర్ణించబడే 15 ఎకరాల తోట మొగల్ గార్డెన్. దీనిని అమృత ఉద్యాన్ అని ఇటీవలే పేరు మార్చారు. మొగల్ గార్డెన్స్ అంటే పర్షియన్ శైలిలో నిర్మించిన తోటలు. మొఘల్ సామ్రాజ్య వ్యవస్థాపకుడు బాబర్‌కు ఇలాంటి తోటలు అంటే చాలా ఇష్టం. భారత్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ వంటి దేశాల్లో ఎన్నో మొగల్ గార్డెన్స్ ఉన్నాయి. వాటన్నింటిలోకెల్లా రాష్ట్రపతి భవన్ ఉన్న మొగల్ గార్డెన్ చాలా ప్రసిద్ధి చెందినది. 1913లో క్యాన్స్ టెన్స్ స్టార్ట్ రాసిన గార్డెన్ ఆఫ్ ది గ్రేట్ మొగల్స్ గ్రంథంలో ఒక గార్డెన్ ను ప్రభుత్వ భవనంగా మార్చాక దాని స్టైల్ ఎలా ఉంటుందో వివరించారు. అదే ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్.
ఇదికూడా చదవండి: అలిపిరి కాలినడక మార్గంలో బోనులో చిక్కిన నాలుగో చిరుత!
రాష్ట్రపతి భవన్ లో ఉద్యాన మహోత్సవము నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నెలరోజులపాటు సామాన్యులు ఉచితంగా మొగల్ గార్డెన్ సందర్శించేందుకు అవకాశం కల్పించారు. ఇక్కడ ఉన్న వివిధ రకాల తోటలు, బోన్సాయ్ మొక్కలు, గులాబీ పూలు చూపర్లను ఎంతోగా ఆకట్టుకుంటున్నాయి. సంగీతానికి అనుగుణంగా నీటిని వెదజల్లే వాటర్ ఫౌంటెన్లు చూడముచ్చటగా ఉన్నాయి. ఈ మొగల్ గార్డెన్ లోకి సాధారణంగా బయట వారిని ఎవరిని అనుమతించరు.
ఏడాది ఫిబ్రవరి నెలలో మాత్రమే సందర్శకులకు గార్డెన్ వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. అయితే ఈసారి ఉజ్జాన్ మహోత్సవం పేరుతో సందర్శకులకు మొగల్ గార్డెన్ చూసే అవకాశం కల్పించారు. భారత రాష్ట్రపతులు జాకీ హుస్సేన్, సి రాజగోపాల చారి, అబ్దుల్ కలాం, సంజీవరెడ్డి పరిపాలించిన సమయంలో మొగల్ గార్డెన్ ను వినూత్నంగా తీర్చిదిద్దారు. ప్రతిరోజు సాయంత్రం సమయంలో రాష్ట్రపతి ఈ మొగల్ గార్డెన్లో విహరిస్తారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే రాష్ట్రపతి భవన్ కు మొగల్ గార్డెన్ ఆణిముత్యం లాంటిదని చెప్పొచ్చు. వివిధ దేశాల రాష్ట్రపతులు ప్రధాన మంత్రులు రాష్ట్రపతి భవన్ కి వచ్చినప్పుడు ఈ మొగల్ గార్డెన్ ని కూడా సందర్శిస్తారు.
ఇది కూడా చదవండి: ఆరు రోజులు.. మూడు విజయాలు.. వేల జ్ఞాపకాలు..భారతీయుల గుండెల్లో ఈ వారం పదిలం!
అమృత్ ఉద్యాన్ పర్యాటకుల కోసం ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు తెరిచి ఉంటుంది. నార్త్ ఎవెన్యూ సమీపంలోని రాష్ట్రపతి భవన్‌లోని గేట్ నంబర్ 35 నుండి ప్రవేశం ఉంటుంది. సెప్టెంబరు 5న ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఇది ప్రత్యేకంగా ఉపాధ్యాయుల కోసం తెరిచి ఉంటుంది. నిర్వహణ, శుభ్రపరచడం కోసం అమృత్ ఉద్యాన్ సోమవారాల్లో మూసివేస్తారు. ఇది కాకుండా, మీరు మరే ఇతర రోజునైనా ఇక్కడకు వెళ్లవచ్చు.
ఇది కూడా చదవండి: వికలాంగులకు సర్కార్ శుభవార్త, సొంత ఇళ్లకు ఆమోదం..!!
దీని కోసం పటేల్ చౌక్ లేదా సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్‌కు వెళ్లి అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్‌కు కాలినడకన వెళ్లాలి. మీరు https://visit.rashtrapatibhavan.gov.in/visit/amrit-udyan/rEని సందర్శించడం ద్వారా అమృత్ ఉద్యానాన్ని సందర్శించడానికి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు మీ వివరాలను పూరించి టిక్కెట్‌ను బుక్ చేసుకోవాలి. కాబట్టి, మీరు ఇప్పటి వరకు మొఘల్ గార్డెన్‌ని సందర్శించలేకపోతే లేదా అమృత్ ఉద్యాన్ అని చెప్పలేకపోతే, మీరు ఈసారి ఇక్కడకు వెళ్లవచ్చు.