తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త..! శ్రీవారి భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం పలు చర్యలు తీసుకుంటోంది. ఆహారం, తాగునీటికి భక్తులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ బోర్డు తెలిపింది.ఇటీవలె అధిక ధరలు, నాణ్యత లేని ఆహార పదార్థాలను విక్రయిస్తున్నారని ఫిర్యాదులతో టీటీడీ ఈ చర్యలు చేపట్టింది. By Durga Rao 05 Aug 2024 in తిరుపతి టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుపతి శ్రీవారి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి రోజూ భక్తులు వస్తుంటారు.భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం పలు చర్యలు తీసుకుంటోంది. ఆహారం, నీళ్ల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.ఇటీవల తిరుమల దేవస్థానంలో అధిక ధరలకు, నాణ్యత లేని ఆహార పదార్థాలను విక్రయిస్తున్నారని ఫిర్యాదులు అందాయి. అనంతరం దేవస్థానం అధికారులు నేరుగా అన్ని హోటళ్లకు వెళ్లి తనిఖీలు నిర్వహించారు.సక్రమంగా నిర్వహించని హోటళ్లపై హెచ్చరికలు జారీ చేసి జరిమానాలు విధించారు. అలాగే భక్తులకు 24 గంటలూ ఆహారం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు.దీంతో భక్తులు ఎలాంటి ఆందోళన లేకుండా తిరుపతికి వెళ్లవచ్చు. ఆహారం విషయంలో ఆందోళన చెందవద్దని తిరుమల దేవస్థానం తెలిపింది. #tirumala మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి