AP Jobs: ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..!! పల్నాడు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో 31ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కాంట్రాక్టు ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేయనున్నారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతోపాటు పనిచేసిన అనుభవం తప్పనిసరిగా ఉండాలి. By Bhoomi 02 Dec 2023 in జాబ్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి నరసరావుపేటలోని జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం కాంట్రాక్ట్ ప్రాతిపదికన పల్నాడు జిల్లాలో 31 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇన్ స్టిట్యూషనల్ కేర్, ప్రొటెక్షన్ ఆఫీసర్ నాన్ ఇన్ స్టిట్యూషనల్ కేర్, లీగల్ కమ్ ప్రొబేషన్, అకౌంటెంట్, సోషల్ వర్కర్, డేటా అనలిస్ట్, అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్, అవుట్ రీచ్ వర్కర్ వంటి పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం పోస్టులు 31 పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పది, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పనిచేసిన అనుభవం తప్పనిసరిగా ఉండాలి. 42ఏళ్లకు మించరాదు. ఆఫ్ లైన్ దరఖాస్తులను జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారిత అధికారి కార్యాలయం బరంపే, నరసరావుపేట, పల్నాడు జిల్లా చిరునామాకు దరఖాస్తును పంపించాలి. ఆఫ్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 13, 2023. అటు రామహేంద్రవరంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ జిల్లా కార్యాలయం కాంట్రాక్టు ప్రాతిపదికన సిబ్బంది నియామకానికి ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ముందు అర్హత, ఎంపిక ప్రక్రియ, వయోపరిమితి, దరఖాస్తు రుసుము వంటి వివరాలను తెలుసుకోవాలి. పోస్టుల వివరాలు : టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 3 – 12పోస్టులు అర్హతలు: బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్, బయోటెక్నాలజీ, డ్రైల్యాండ్ అగ్రికల్చర్ బాటనీ సబ్జెక్టులలో పాసై ఉండాలి. వయస్సు: 35ఏళ్లు మించరాదు దరఖాస్తు విధానం: నోటిఫికేషన్ ప్రకారం నిర్ణీత నమూనాలో ఆఫ్ లైన్ దరఖాస్తులను సంబంధిత ధ్రువపత్రాల జిరాక్సులను జతచేసి రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా డిస్ట్రిక్ట్ సివిల్ సప్లయ్ మేనేజర్ ఆఫీస్, ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ జిల్లా కార్యాలయం, రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా ఈ చిరునామాకు పంపించాలి. దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 05, 2023 ఎంపిక విధానం: అకాడమిక్ మార్కులు, పని అనుభవం, అదనపు విద్యార్హతలు ఆధారంగా సెలక్ట్ చేస్తారు. ఇది కూడా చదవండి: సీబీఎస్ఈ 10, 12వ తరగతి విద్యార్థులకు అలర్ట్.. బోర్డు కీలక ప్రకటన….!! #ap-jobs మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి