Ayodhya: అయోధ్య వెళ్లే భక్తులకు శుభవార్త.. 15 రైళ్లను ప్రకటించిన రైల్వే.. వివరాలివే!

అయోధ్యలో చారిత్రక రామమందిర నిర్మాణం వేగంగా పూర్తవుతోంది. జనవరి 22న విగ్రహాల ప్రాణప్రతిష్ట కార్యక్రమం నిర్వహించనున్నారు. రామమందిర ప్రారంభోత్సవానికి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 15 రైళ్లను ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

New Update
Ayodhya: అయోధ్య వెళ్లే భక్తులకు శుభవార్త.. 15 రైళ్లను ప్రకటించిన రైల్వే.. వివరాలివే!

అయోధ్యలో (Ayodhya) రామమందిర నిర్మాణం శరవేగంగా పూర్తవుతోంది. వచ్చేనెల 22న విగ్రహాల ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు. అంతకంటే ముందే అయోధ్యలో (Ayodhya) ఆధునీకరించిన రైల్వే స్టేషన్ (A modernized railway station) కూడా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం నేడు ప్రధాని మోదీ చేతుల మీదు జరగబోతోంది. ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు మరో శుభవార్త చెప్పారు.

అయోధ్యలో(Ayodhya) గతంలో పాత రైల్వే స్టేషన్ ఉండేది. అక్కడికి అంతగా రైళ్ల రాకపోకలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు కొత్త రైల్వే స్టేషన్ ప్రారంభం అవ్వగానే భారీ ఎత్తున ప్రయాణికులు రాకపోకలు ప్రారంభించనున్నారు. దీనికి తగ్గట్టుగా రైల్వేస్టేషన్ నిర్మించారు అధికారులు. కానీ ఇప్పుడు వారి కోసం కొత్త రైళ్లను కూడా ప్రారంభించింది రైల్వే శాఖ. అయోధ్య స్టేషన్ (Ayodhya Station) నుంచి అయోధ్య స్టేషన్ కు రాకపోకలు సాగించేలా కొత్తగా 15 రైళ్లు ప్రారంభించేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు.

అయితే అయోధ్య రామమందిరం (Ayodhya Ram Mandir)ప్రారంభోత్సవానికి ముందు ఈ కొత్త రైళ్ల ప్రారంభం లేదనే సమాచారం. రామమందిరం ప్రారంభోత్సవం పూర్తైన తర్వాతే ఈ కొత్త రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. దీంతో భవిష్యత్తులో భక్తుల రాకపోకల్ని దృష్టిలో ఉంచుకుని ఈ రైళ్లను అందుబాటులోకి తెస్తున్నారు. కొత్త రైళ్లు ప్రతిరోజూ నడుస్తాయని అయోధ్య ధామ్ వరకు వీటిని నడిపించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇతర గమ్యస్థానాలకు రైళ్లు అయోధ్య కాంట్ స్టేషన్ నుంచి ప్రయాణం ప్రారంభిస్తాయి.

బీహార్‌లోని దర్భంగా, ఢిల్లీలోని ఆనంద్ విహార్ (Anand Vihar), అయోధ్య, పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా టౌన్, బెంగళూరులోని ఎం విశ్వేశ్వరయ్య టెర్మినస్ (M Visvesvaraya Terminus) మీదుగా ఈ రైళ్లు నడుస్తాయి.రైలు కార్యకలాపాలలో ప్రత్యేకమైన ఆవిష్కరణ అయిన సెమీ-కప్లర్ టెక్నాలజీ సహాయంతో, అమృత్ భారత్ రైళ్లు (Amrit Bharat Trains) గరిష్టంగా 130 కి.మీ వేగంతో నడుస్తున్న వివిధ గమ్యస్థానాలకు సాఫీగా ప్రయాణాన్ని అందిస్తాయి.ప్రయాణంలో ఏ సమయంలోనైనా ప్రయాణికులకు ఎలాంటి కుదుపు కలగకుండా ఉండేలా సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మొదటి రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను అయోధ్య నుంచి ఫ్లాగ్ ఆఫ్ చేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి : 12 పాస్ అయ్యారా?అయితే మీకు గుడ్ న్యూస్…ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో భారీ రిక్రూట్ మెంట్..పూర్తి

వివరాలివే..!!

Advertisment
తాజా కథనాలు