TG Jobs : నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. దరఖాస్తుకు నో ఫీజ్! టెట్ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టెట్ అర్హత సాధించని వారికి ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. అర్హులు కాని అభ్యర్థులు వచ్చే టెట్‌కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. By Bhavana 13 Jun 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana : ఈ ఏడాది తెలంగాణలో జరిగిన టీజీ టెట్ ఫలితాలను (TG TET Results) సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బుధవారం మధ్యాహ్నం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాల్లో టెట్ పేపర్-1 లో 67.13 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. మొత్తం 85,996 మంది పరీక్షకు హాజరు అవ్వగా వారిలో 57,725 మంది అభ్యర్థులు అర్హత పొందారు. పేపర్-2లో 34.18 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. ఈ క్రమంలో టెట్ అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టెట్ అర్హత సాధించని వారికి ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. అర్హులు కాని అభ్యర్థులు వచ్చే టెట్‌కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. అర్హత సాధించిన వారు డీఎస్సీ (DSC) కి ఉచితంగా అప్లై చేసుకోవచ్చని టీజీ గవర్నమెంట్ తెలిపింది. ఎన్నికల కోడ్ (Election Code) వల్ల టెట్-2024 దరఖాస్తు ఫీజును ప్రభుత్వం తగ్గించలేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. Also read: ఏపీలో నేటి నుంచి స్కూళ్లు రీఓపెన్! #telangana #cm-revanth-reddy #tg-tet-results-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి