Super star krishna - Guntur karam: స్టార్ హీరోల సినిమాకు కొన్ని ఫార్ములాలు ఉంటాయి. వాటి పరిధిలోనే చిత్రాలను రూపొందిస్తారు. ఇక..స్టార్స్ వారసుల సినిమాల్లో అయితే ఆనాటి హిట్ పాటలను రీమిక్స్ చేయడం, అయా సినిమాల్లో పాపులర్ అయిన డైలాగ్ వాడుకోవడం మనం చూస్తూనే ఉన్నాం ఎప్పటి నుంచో వస్తోన్న ఆనవాయితీ గతంలో ఈ ఫార్ములాను అప్లై చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన దాఖాలులు చాలా ఉన్నాయి. యమదొంగ మూవీలో ఓ పాటలో జూనియర్ ఎన్టీఆర్ పక్కన అన్నగారు యన్టీఆర్ తళుక్కున మెరిసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే కోవలోకి సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చారు. గుంటూరు కారం మూవీలో సూపర్ స్టార్ కృష్ణ పాపులర్ డైలాగ్స్ తో అలరించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
మహేష్ బాబు గతంలో ఎన్నడూ కనిపించని మాస్ లుక్ లో ఈ మూవీలో కనిపిస్తుండటంతో అటు ఫ్యాన్స్ ,ఇటు ట్రేడ్ వర్గాలు చాలా ఖుషీగా ఉన్నారు. కేవలం మాస్ ఆడియన్స్ ను టార్గెట్ పెట్టేవిధంగా ఈ సినిమా ఉండబోతోందని సమాచారం. వాళ్ళను మెప్పించేందుకు మరిన్ని మాస్ అంశాలు జోడించారనీ, అందులో భాగంగానే పాటలు కూడా మాసిగా ఉన్నాయి.‘కుర్చీని మడతపెట్టి’ అనే పాట విమర్శలకు గురి అవుతున్నా – ఈ పాట మాస్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది. పండగ మొదలయ్యేది ఈ గుంటూరు కారం మ్యానియాతో అని ఇప్పటికే అర్థం అయింది. యూట్యూబ్ నే షేక్ చేస్తుంటే. థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.
ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్.
గుంటూరు కారం మూవీలో సూపర్ స్టార్ కృష్ణ రిఫరెన్సులు కూడా చాలా ఉన్నాయని తెలుస్తోంది. కృష్ణ మరణంచిన తరవాత మహేష్ బాబు చేస్తోన్న సినిమా ఇదే. కాబట్టి.. కృష్ణ ని గుర్తు చేసేలా కొన్ని సీన్లు డిజైన్ చేశారట త్రివిక్రమ్. ఓ ఫైట్ సీన్లో.. కృష్ణ వాడిన డైలాగ్ తో పాటు, పాటలోని బీజియమ్ని కూడా వాడారని తెలుస్తోంది. మరి ఆ డైలాగ్ ఏమిటి? ఆ పాటేమిటి? అనేది తెలియాల్సి ఉంది.
జనవరి 6 న ట్రైలర్ రిలీజ్
సూపర్ స్టార్ మహేష్ బాబుకు జోడీగా స్టన్నింగ్ బ్యూటీ శ్రీ లీల, మీనాక్షి చౌదరి నటిస్తుండగా థమన్ బాణీలు దుమ్ము రేపుతున్నాయి.ఇప్పటివరకు రిలిజయిన ప్రమోషనల్ కంటెంట్ తో సినిమాపై బారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక .ఈనెల 6న ‘గుంటూరు కారం’ ట్రైలర్ రాబోతోంది. ఆ ట్రైలర్లో సూపర్ స్టార్ కృష్ణ గారికి అభందుంచిన క్లిప్స్ ఏమయినా యాడ్ చేస్తారేమో చూడాలి. లేదా ఒక్కసారి సర్ప్రైజ్ ఇచ్చేందుకు థియేటర్స్ లోనే రీవీల్ చేస్తారా అనేది చూడాలి.
ALSO READ:Guntur Karam political punches:గుంటూరు కారం మూవీలో పొలిటికల్ పంచులు..!! టార్గెట్ ఎవరు ?