SBI : విద్యార్థులకు శుభవార్త...ఆ బ్యాంకు నుంచి ఉచితంగా రూ.10వేలు...ఇలా ఆప్లై చేస్తే సరి..!!

పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చింది ఎస్బీఐ ఫౌండేషన్. ఉచితంగా రూ. 10వేల స్కాలర్ షిప్ అందిస్తోంది. ఈ స్కాలర్ షిప్ కు 6వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులు అప్లయ్ చేసుకోవచ్చు.

New Update
CBSE: సీబీఎస్ఈ 10, 12వ తరగతి విద్యార్థులకు అలర్ట్.. బోర్డు కీలక ప్రకటన....!!

ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఎస్‌బీఐ ఫౌండేషన్‌ సువర్ణ అవకాశం కల్పిస్తోంది. టాలెంట్ ఉన్న స్టూడెంట్స్ ను మరింత ప్రోత్సహించేందుకు తన వంతు సహకారం అందించడంలో మరో ముందడుగు వేసింది. ఈ మేరకు ఎస్‌బీఐఎఫ్‌ ఆశా స్కాలర్‌షిప్‌ కోసం అర్హులైన విద్యార్థులనుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్‌ వేదికగా (https://www.sbifoundation.in/focus-area-detail/SBIF-Asha-Scholarship) ఈ నెల చివరి తేది వరకూ అప్లై చేసుకునే అవకాశం కల్పించింది.

ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న భారతీయ విద్యార్థులు ఎవరైనా ఈ స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తులు చేసుకోవచ్చు. గత విద్యా సంవత్సరంలో విద్యార్థులు కనీసం 75% మార్కులు సాధించి ఉండాలి. దరఖాస్తుదారు కుటుంబ ఆదాయం రూ.3లక్షలు మించరాదు. కావాల్సిన డాక్యుమెంట్లు.. గత విద్యాసంవత్సరానికి సంబంధించిన మార్కుల షీట్‌, ప్రభుత్వ గుర్తింపు కార్డు( ఆధార్‌ వంటివి), ప్రస్తుత సంవత్సరంలో అడ్మిషన్‌కు సంబంధించిన ఆధారాలు (ఫీజు రిసీట్‌, అడ్మిషన్‌ లెటర్‌/స్కూల్‌ ఐడీ కార్డు/బోనఫైడ్‌ సర్టిఫికెట్‌), ఆదాయానికి సంబంధించిన ఆధారాలు (ఫామ్‌ 16ఏ/ఆదాయ ధ్రువీకరణ పత్రం/ శాలరీ స్లిప్‌), దరఖాస్తు దారు ఫొటో ఇవన్నీ తప్పనిసరిగా ఉండాలని కోరింది.

ఇక అప్లై చేసుకునే విధానం.. ఈ స్కాలర్‌షిప్‌నకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ-మెయిల్‌/మొబైల్‌ నంబర్‌/జీమెయిల్‌ ఖాతాలతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తును పూర్తి చేసే సమయంలో అడిగిన డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేయాలి. నిబంధనలను అంగీకరించిన అనంతరం ప్రివ్యూపై క్లిక్‌ చేసి మనం నమోదు చేసిన వివరాలన్నీ సరిగా వున్నాయో లేదో చెక్‌ చేసుకొని సబ్మిట్‌ చేయాలి. అకడమిక్‌ మెరిట్‌, ఆర్థిక పరిస్థితి ఆధారంగా ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేస్తారు. వచ్చిన దరఖాస్తులను అర్హతల ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఉంటుంది. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా స్కాలర్‌షిప్‌ మొత్తాన్ని జమ చేస్తారు. ఇది వన్‌టైమ్‌ స్కాలర్‌షిప్‌ మాత్రమే. మరిన్ని వివరాల కోసం 011-430-92248 (303) సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు సంప్రదించవచ్చు. లేదా [email protected] ఈ మెయిల్‌ చేయవచ్చు.

ఆన్‌లైన్‌ అప్లికేషన్ లింక్ : https://www.sbifoundation.in/focus-area-detail/SBIF-Asha-Scholarship

Advertisment
తాజా కథనాలు