School Holidays : విద్యార్థులకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు శుభవార్త చెప్పాయి. మహాశివరాత్రి సందర్భంగా వరుసగా మూడురోజులు సెలువులను ప్రకటించాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మహాశివరాత్రి మార్చి 8వ తేదీన వస్తోంది. అయితే మహాశివరాత్రికి ప్రతి ఏడాది మూడు రోజులు జరుపుకుంటారు. అయితే ప్రభుత్వం ఉద్యోగులు, విద్యార్థులకు మొదటిరోజు మాత్రమే హాలీడ్ ను ప్రకటిస్తాయి. కానీ ఈసారి మార్చి 8వ తేదీ ఒకరోజు సెలవు ప్రకటించినా...ఆ రోజు శుక్రవారం కావడం..మరుసటిరోజు రెండో శనివారం, మూడు రోజు ఆదివారం కావడంతో వరుసగా మూడురోజులు సెలవులు వచ్చాయి. ఈ మేరకు విద్యాశాఖ మూడు రోజుల సెలవులను మంజూరు చేస్తూ ప్రకటన విడుదల చేసింది.
నీట్ యూజీ ఎగ్జామ్.. ఎన్ని ప్రశ్నలుంటాయి..? నెగిటివ్ మార్కింగ్ ఎంత?
దేశవ్యాప్తంగా మెడికల్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం కోసం పెన్-పేపర్ ఆధారిత నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(NEET UG) మే 5, 2024న నిర్వహించనున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) NEET UG కోసం ఆన్‌లైన్ అప్లికేషన్ విండోను తెరిచింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 9 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను ఫిల్ చేయవచ్చు. MBBS, BAMS, BUMS, BSMS కాకుండా, BHMS లో ప్రవేశం కూడా NEET UG మెరిట్ స్కోర్ ఆధారంగా జరుగుతుంది.
13 భారతీయ భాషలలో పరీక్ష:
NEET UG 2024 పరీక్ష హిందీ, ఇంగ్లీషుతో సహా 13 భారతీయ భాషలలో నిర్వహించనున్నారు. పరీక్ష హిందీ, ఇంగ్లీష్, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, తమిళం, తెలుగు, ఒరియా, మలయాళం, కన్నడ, పంజాబీ, ఉర్దూ భాషలలో ఎగ్జామ్‌ను నిర్వహిస్తారు.
నెగెటివ్ మార్కింగ్:
యూజీ పరీక్షను ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనే 3 విభాగాలుగా విభజించారు. పరీక్షా మాధ్యమం పెన్-పేపర్ ఆధారంగా అంటే ఆఫ్‌లైన్‌లో ఉంటుంది. పరీక్ష వ్యవధి 3 గంటల 20 నిమిషాలు. ఇది మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5:20 వరకు ఉంటుంది. ఇందులో మొత్తం 200 ప్రశ్నలు అడుగుతారు. ఫిజిక్స్ విభాగంలో 35 అండ్ 15 ప్రశ్నలు (45 ప్రశ్నలు పరిష్కరించాల్సి ఉంటుంది), కెమిస్ట్రీ విభాగంలో 35 అండ్ 15 ప్రశ్నలు (45 ప్రశ్నలు పరిష్కరించాల్సి ఉంటుంది) ఉంటాయి. బయాలజీ-జువాలజీలో 35 అండ్ 15 ప్రశ్నలు, ప్లాంట్ సైన్స్‌లో 35 అండ్ 15 ప్రశ్నలు ఉంటాయి. ఈ రెండు సబ్జెక్టుల్లో 45-45 ప్రశ్నలను పరిష్కరించాల్సి ఉంటుంది. విద్యార్థులు ప్రతి సబ్జెక్టులోని-బి విభాగంలో 15 ప్రశ్నలకు 10 మాత్రమే రాయాలి. ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులు, తప్పు సమాధానానికి ఒక మార్కు కట్ చేస్తారు. పరీక్ష 720 మార్కులకు ఉంటుంది.
ఇది కూడా చదవండి: 1849 రూపాయలకే ఐఫోన్ 14…ఈ వాలంటైన్స్ మీ భాగస్వామికి గిఫ్ట్ ఇవ్వండి..!!