PM Kisan: రైతులకు శుభవార్త.. రేపే ఖాతాల్లోకీ పీఎం కిసాన్ డబ్బులు!

15వ విడత పీఎం కిసాన్ నిధుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు శుభవార్త. బుధవారం ఝార్ఖండ్ నుంచి పీఎం మోదీ కిసాన్ నిధులను విడుదల చేయనున్నారు. లబ్ధిదారుల జాబితాలో మీరు పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ లింక్ ద్వారా చెక్ చేసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి.

PM Kisan Yojana: రైతులకు మోదీ సర్కార్ షాక్.. పీఎం కిసాన్ పై కేంద్ర మంత్రి కీలక ప్రకటన!
New Update

భారతదేశంలోని వ్యవసాయం, అభివృద్ధి, రైతుల సంక్షేమానికి సహాయం చేయాలన్న ప్రాథమిక లక్ష్యంతో 2019 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు ఏడాదికి రూ. 6000చెల్లిస్తారు. ఇది మొత్తం మూడు విడతలుగా జరుగుతుంది. ఏటా 3 విడతలుగా పంటసాయం అందిస్తున్న కేంద్రం..ఒక్కో విడత 2వేల రూపాయలను చెల్లిస్తోంది.

ప్రతి సంవత్సరం ఏప్రిల్ -జులై, ఆగస్టు -నవంబర్, డిసెంబర్ -మార్చి సమయంలో రైతులకు కేంద్రం అందించే ఆర్థిసాయం అందుతుంది. అయితే 2023 ఫిబ్రవరిలో 13వ విడత డబ్బు రైతుల ఖాతాల్లో జమ కాగా..ఈ ఏడాది జులైలో 14 వ విడత పీఎం కిసాన్ నిధులు పంపిణీ అయ్యాయి. ఇక ఇఫ్పుడు రైతులంతా 15వ విడత కిసాన్ నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి శుభవార్త. 15వ వాయిదా కింద అర్హులైన దాదాపు 8కోట్ల మందికి పైగా రైతుల అకౌంట్లో రూ. 2వేలు చొప్పున జమ చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఝార్ఖండ్ లోని ఖుంటిలో బుధవారం ఉదయం 11.30గంటల ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నిధులను రిలీజ్ చేస్తారని పేర్కొంది. ఎవరైతే ఈ కేవైసీ పూర్తి చేస్తారో వారి అకౌంట్లో నిధులు జమ అవుతాయి.

దేశవ్యాప్తంగా రైతులకు లబ్ధి జరిగేలా కేంద్రం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరిట పథకాన్ని అమలు చేస్తోంది. ఏడాదిలో మూడు దఫాలుగా రూ. 6వేలు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తుంది. ఒక్కో విడతలో అర్హులైన రైతుల అకౌంట్లోకి రూ. 2వేల చొప్పును జమ చేస్తున్నారు. ఇప్పటివరకు కేంద్రం ఈ పథకం కింద 14 విడతలుగా నగదును జమ చేసింది. తాజాగా బుధవారం 15వ విడత నిధులు రిలీజ్ చేయనుంది. ఈ కేవైసీ చేయించుకున్న వారిని లబ్ధిదారులుగా గుర్తించి వారి అకౌంట్లో డబ్బులు జమ చేస్తారు. అయితే లబ్ధిదారులు జాబితాలో తమ పేరు ఉందో లేదో కూడా ఈ డైరెక్ట్ లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

-మొదట https://pmkisan.gov.in/వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

-తర్వాత బెనిఫిషియరీ జాబితా ఆప్షన్ పై క్లిక్ చేయండి.

- ఆ తర్వాత ఆప్షన్ పై క్లిక్ చేస్తే https://pmkisan.gov.in మరో పేజీకి వెళ్తుంది.

-అక్కడ లబ్ధిదారుని రాష్ట్రం, జిల్లా, ఉపజిల్లా, బ్లాక్, గ్రామాలను సెలక్ట్ చేసుకుని గెట్ రిపోర్ట్ పై క్లిక్ చేస్తే లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది.

-ఏదైనా సమాచారం కోసం పీఎం కిసాన్ హెల్ప్ లైన్ నెంబర్ 155261/011-24300606 నెంబర్ కు కాల్ చేయవచ్చు.

ఇది కూడా చదవండి: మా ఆయన గెలుపు ఖాయం.. రాజగోపాల్ రెడ్డి సతీమణి సంచలన ఇంటర్వ్యూ..!!

#pm-kisan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe