Diabetes: డయాబెటిస్ పేషెంట్లకు గుడ్ న్యూస్..!

చైనా సైంటిస్టులు సెల్ థెరపీతో డయాబెటిస్ నయం చేశారు. తాజాగా, అందుబాటులోకి వచ్చిన సెల్ థెరపీతో టాబ్లెట్లు, ఇన్సులిన్ ఇంజెక్షన్ల బాధ తప్పే అవకాశం ఉంది. ఈ విధానం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవని వైద్యులు వెల్లడించారు.

New Update
Diabetes: డయాబెటిస్ పేషెంట్లకు గుడ్ న్యూస్..!

Diabetes: చైనా సైంటిస్టులు సెల్ థెరపీతో డయాబెటిస్ ను నయం చేశారు. తాజాగా, అందుబాటులోకి వచ్చిన ఈ సెల్ థెరపీతో టాబ్లెట్లు, ఇన్సులిన్ ఇంజెక్షన్ల బాధ తప్పే అవకాశం ఉంది. సెల్ థెరపీ ద్వారా మధుమేహం పేషెంట్లలోని పెరిపెరల్ బ్లడ్ మోనో న్యూక్లియర్ సెల్స్‌ ను సీడ్ సెల్స్ గా మారుస్తారు. ప్యాంక్రియాట్ ఐలెట్ సెల్స్ రీ క్రియేట్ చేశారు.

నో సైడ్ ఎఫెక్ట్స్..

ఈ ప్రక్రియ ద్వారా డయాబెటిస్ ను కంట్రోల్ చేశారు. ఈ విధానం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవని డాక్టర్లు వెల్లడించారు. అయితే, ఈ కొత్త విధానానికి సంబంధించి తొలి దశ ప్రయోగం సక్సెస్ అయినా ఇంకా కొన్ని పరిశోధనలు కొనసాగుతున్నాయి. అవి కూడా సక్సెస్ అయితే, ఇక ఈ విధానం అమల్లోకి వస్తుంది.

Also Read: ప్రజా భవన్ పేలి పోతుంది.. బాంబ్ బెదిరింపు కాల్ కలకలం..!

మరింత విస్తృతం..

దాదాపు, గత 25 సంవత్సరాలుగా చైనా డాక్టర్లు సెల్ థెరపీపై పరిశోధనలు కొనసాగిస్తున్నారు. డయాబెటిస్ తో బాధపడుతున్న 59 ఏళ్ల బాధితుడిపై సెల్ థెరపీ ప్రయోగం మొదలు పెట్టారు. ఈ వ్యక్తికి 2017లో షుగర్ కారణంగా కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగింది. ఆ తరువాత కొద్ది రోజుల నుంచి ఈ పరిశోధన మరింత విస్తృతం చేశారు. సెల్ థెరపీ ద్వారా వైద్యులు అతడికి చికిత్స కొనసాగించారు.

మెరుగుపడినట్లు..

అయితే, ఈ ట్రీట్మెంట్ మొదలు పెట్టిన తర్వాత సుమారు 10 నుంచి 11 వారాల తర్వాత ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరమే కనిపించలేదని వైద్యులు తెలిపారు. షుగర్ కంట్రోల్ కోసం టాబ్లెట్లు కూడా వేసుకోలేదని.. సెల్ థెరపీ మొదలు పెట్టిన తర్వాత డయాబెటిక్ పేషెంట్ లో ప్యాంక్రియాటిక్ ఐలెట్ పని తీరు మెరుగుపడినట్లు పరిశోధకులు గుర్తించారు. తర్వాత పూర్తిగా అతను మధుమేహాం నుంచి కోలుకున్నాడన్నారు.

Advertisment
తాజా కథనాలు