Ayodhya: అయోధ్య వెళ్లే భక్తులకు..టీటీడీ గుడ్ న్యూస్..ఏంటో తెలుసా?

అయోధ్యాపురిలో కొలువుదీరనున్న రామయ్యను దర్శించుకునేందుకు వెళ్తున్నారా? అయితే మీకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. అయోధ్యలో పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని వితరణ చేసేందుకు టీటీడీ సిద్ధమయ్యింది. రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా తిరుమల లడ్డూలను పంపనున్నట్లు ఈవో తెలిపారు.

Ayodhya: అయోధ్య వెళ్లే భక్తులకు..టీటీడీ గుడ్ న్యూస్..ఏంటో తెలుసా?
New Update

Ayodhya: శ్రీవేంకటేశ్వరుడైనా...అయోధ్య శ్రీరాముడైనా..ఆ శ్రీ మహావిష్ణువు అవతారాలే. రామనామం అయోధ్యలో మారుమోగిన వెంటనే తిరుమలను హనుమ జన్మస్థలంగా టీటీడీ (TTD) ప్రకటించింది. అవతారాలు వేరు కావచ్చు..యుగయుగాల్లో దుష్టశిక్షణ, శిష్ట రక్షణార్థం శ్రీ మహా విష్ణువు ఎన్నో రూపాయల్లో భూమిపై అతరించారని పురాణాలు చెబుతుంటాయి. కలియుగంలో శ్రీవేంకటేశ్వరుడిగా కొలువుదీరిన ఆ స్వామి...త్రేతాయుగంలో శ్రీరామ చంద్రమూర్తిగా సమస్త భూమండలాన్ని పాలించారు.

ఎన్నో అవరోధాలు నడమ అయోధ్యలో రామమందిరం పున నిర్మాణం పూర్తయి...శ్రీ సీతలక్ష్మణ ఆంజేనయ సమేత శ్రీరామచంద్రస్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట జనవరి 22న అయోధ్యపురిలో వైభవంగా జరగనుంది. జనవరి 17 నుంచే అయోధ్యాపురిలో రామనామం మారుమ్రోగనంది. శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్రమోదీ, యూపీ సీఎం యోగిఆదిత్యనాథ్ తోపాటు దేశంలోని ఎంతో మంది ప్రముఖులు, సాధువులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. రామనామంతో దేశం మొత్తం పులకించిపోనుంది. అయోధ్యలో కొలువుదీరనున్న ఆ రాములవారిని కనులారా తిలకించాలని భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ ఘడియ కోసం పరితపిస్తున్నారు.

అయోధ్యకు శ్రీవారి లడ్డూ:
ఈ శుభసందర్భంలో అయోధ్యలో పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని వితరణ చేసేందుకు టీటీడీ సిద్ధమయ్యింది. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా తిరుమల లడ్డూలను పంపనున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

అయోధ్యకు టీటీడీ లక్ష లడ్డూలు:
లడ్డూ పరిమాణం 176 గ్రాముల నుంచి 200 గ్రాముల వరకు ఉంటుంది. కానీ అయోధ్య రామ మందిరం కొరుకు టీటీడీ స్పెషల్ గా లడ్డూ తయారీ చేయనుంది. ఈ ప్రత్యేకమైన లడ్డూ 25 గ్రాములు వరకు ఉంటుంది. 25గ్రాముల లడ్డూలను లక్ష వరకు తయారు చేసి అయోధ్యకు తీసుకెళ్లనున్నట్లు ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని పోటులో ఈ లడ్డూ తయారు చేయనుంది టీటీడీ. త్వరలోనే ఈ లడ్డూలను అయోధ్యకు తరలించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: విషాదం..విమాన ప్రమాదంలో ప్రముఖ నటుడు,ఆయన ఇద్దరు కూతుళ్లు దుర్మరణం..!!

#ayodhya #ttd
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి