భారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) త్వరలో యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పనుంది. బీఎన్‌ఎస్‌ఎల్ 4జీ నెట్‌వర్క్‌ను ఆగస్టు నాటికి 4G services లాంచ్ చేయనుంది. గతంలోనూ 4జీ సేవలు ప్రారంభంపై వార్తలు వచ్చినా.. తాజాగా BSNL సంస్థ 4జీ ప్లాన్స్‌ను సోషల్ మీడియా వేదికగా వివరాలను వెల్లడించింది.
- PV2399 : ఈ రూ.2,399 ప్లాన్ 395 రోజుల వాలిడిటీ ఉంటుంది. ఈ ప్లాన్‌తో ప్రతిరోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్లు, 2జీబీ డేటా పొందొచ్చు.
- PV1999 : ఈ ప్లాన్ 600GB డేటాతో పాటు 365 రోజుల చెల్లుబాటు అవుతుంది. 100 ఉచిత ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది.
- PV997 : ఈ ప్లాన్ 160 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 2జీబీ డేటాతో పాటు 100 ఉచిత ఎస్ఎంఎస్లు వస్తాయి.
- STV599 : ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిటీ ఉంటుంది. అపరిమిత కాలింగ్‌తో పాటు రోజుకు 3జీబీ డేటా పొందొచ్చు.
- STV347 : ఈ ప్లాన్ 54 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ప్రతిరోజూ 2జీబీ డేటాతో పాటు 100 ఉచితంగా ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్ కాలింగ్ సదుపాయం ఉంటుంది.
- PV199 : ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో ఉంటుంది. ఇది రోజుకు 2జీబీ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, 100 ఉచిత ఎంఎంఎస్‌లు వస్తాయి.
- PV153 : ఈ ప్లాన్ 26 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. మొత్తం 26 జీబీ డేటా, 100 ఉచిత ఎస్ఎంఎస్లు, అపరిమిత కాలింగ్ ఉంటుంది.
- STV118 : ఈ ప్లాన్ 20 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. అలాగే.. 100 ఉచిత ఎస్ఎంఎస్లు, 10 జీబీ డేటా పొందొచ్చు.