ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు వినియోగదారులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు రేషన్ ద్వారా బియ్యం, పంచదార మాత్రమే పంపిణీ చేస్తుండగా ఇక నుంచి కందిపప్పు కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
దీని గురించి పౌర సరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ ప్రకటించారు. వచ్చే మూడు నెలల పాటు వీటిని సరఫరా చేస్తామని తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి రైతుల వద్ద నుంచి కందులను కొని వాటిని మిల్లింగ్ చేసి కార్డుదారులకు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం మార్కెట్లో కందిపప్పు ధర రూ. 180 నుంచి 200 వరకు ఉంది. దీంతో గత కొన్ని నెలలుగా రేషన్ షాపుల్లో కందిపప్పు సరఫరా చేయడం లేదు.
ఈ స్టోరీ అప్డేట్ అవుతోంది.....