Crime News: ఇది నీకు, ఇది నీకు.. ఇది నాకు!... డైలాగ్ చదువుంతుంటూనే ఇంద్ర సినిమా గుర్తొచ్చింది కదా. కాశీ ట్రిప్ కోసం వచ్చిన ఏవీఎస్ ఫ్యామిలీని బంగారం డబుల్ చేస్తామంటూ బ్రహ్మానందం గ్యాంగ్ మోసం చేస్తే, మెగాస్టార్ ఎంటరై దాన్ని తిరిగి ఇప్పిస్తాడు. అచ్చం ఇలాంటి ఘటనే జరిగిందిప్పుడు. కాకపోతే జరిగింది హైదరాబాద్ లో. ఆ ఘరానా మోసగాణ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు వివరాలు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: ఆ లెక్కలు తేల్చండి.. అధికారులకు మంత్రి ఉత్తమ్ సంచలన ఆదేశాలు
నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలం పెద్దగుమ్మడం గ్రామానికి చెందిన కోట్ల హరికృష్ణ (35) వెంకటేశ్వర కాలనీలో ఉంటున్నాడు. ఉన్నచోట ఉండకుండా యూట్యూబ్ చూసి దొంగ అలవాట్లు చేసుకున్నాడు. బంగారు వస్తువులను డబుల్ చేసే మ్యాజిక్ ట్రిక్స్ వీడియోలు చూసి బాగా ప్రాక్టీస్ చేశాడు. వనస్థలిపురం కమలానగర్‌కు చెందిన పురంతు వీరయ్య అనే వ్యక్తి ఈ మధ్యే హరికృష్ణకు పరిచయమయ్యాడు. చాలా రోజులుగా మోసపోయే అమాయకుడి కోసం ఎదురుచూస్తున్న హరికృష్ణ తన టైం వచ్చిందనుకుని ప్రొసీడ్ అయ్యాడు.
ఇది కూడా చదవండి: నాగర్ కర్నూల్‌లో నర హంతకుడు.. 20 మందిని చంపి..?
మాయమాటలతో వీరయ్యను నమ్మించి మొదట ఐదు వందల రూపాయల నోట్లు తీసుకున్నాడు. మొత్తం 74 నోట్లు తీసుకున్న హరికృష్ణ వాటిని డబుల్ చేసినట్లు నమ్మించాడు. పూర్తిగా హరికృష్ణ బుట్టలోపడ్డ వీరయ్య ఈసారి కొన్ని బంగారు ఆభరణాలు కూడా ముట్టజెప్పాడు.
ఓ పెట్టెలో కొన్ని బంగారు నగలు, ఆబరణాలు పెట్టి మూతపెట్టి ఇచ్చాడు. 40 రోజుల తర్వాత మూత తీసి చూస్తే డబుల్ అవుతాయని చెప్పి వెళ్లిపోయాడు. తర్వాత బాక్స్ ఓపెన్ చేసిన వీరయ్యకు పెద్ద షాకే తగిలింది. డబుల్ అవ్వడం పక్కనపెడితే తానిచ్చిన బంగారం కూడా అందులో లేదు. మొత్తానికి చివర్లో మోసాన్ని గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో హరికృష్ణ మోసం ఒప్పుకుని ఏ షాపులో ఆ బంగారం అమ్మేశాడో కూడా చెప్పాడు. అతడి నుంచి రూ. లక్షన్నర నగదు, కారు, సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.