Gold Rates Update : బంగారం కొనాలంటే మంచి టైమ్.. ఈరోజు తులం ఎంతంటే.. 

వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. మార్కెట్ స్టార్ట్ అయ్యేటప్పటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర 22 క్యారెట్లు 10 గ్రాములు ₹ 66,700, 24 క్యారెట్లు 10 గ్రాములు ₹ 72,770 గా ఉంది. కేజీ వెండి రేటు భారీగా తగ్గి ₹ 90,900 గా ఉంది.  

New Update
Gold Price Policy: ఇప్పుడు దేశం మొత్తం బంగారానికి ఒకే ధర, 'వన్ నేషన్, వన్ రేట్' విధానాన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది!

Gold Rates Today : వరుసగా తగ్గుతూ వస్తున్నాయి బంగారం ధరలు (Gold Rates). ఈ నెల మొదటి నుంచి తగ్గుదల బాటలోనే ఉన్న బంగారం ధరలు ఈరోజు మాత్రం మార్పులు లేకుండా నిలిచాయి.  అలాగే  వెండి విషయానికి వస్తే ఇటీవల భారీగా తగ్గుదల నమోదు చేస్తూ వస్తోంది. అయితే, ఈరోజు స్వల్పంగా వెండి ధరలు (Silver Rates) తగ్గాయి. మొత్తంగా చూసుకుంటే ఈరోజు అంటే సెప్టెంబర్ 4న బంగారం ధరలు స్థిరంగా నిలిచి బంగారం కొనాలని అనుకునేవారికి ఊరట కలిగించాయని చెప్పవచ్చు.  ఇక ఈరోజు అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు కొ తగ్గుదలతో ట్రేడ్ అవుతున్నాయి.   ఈ నేపథ్యంలో ఆప్రభావం ఎప్పటిలానే మన మార్కెట్లపై కూడా కనిపించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దీంతో ఈరోజు మార్కెట్ ముగిసే సరికి బంగారం, వెండి ధరలు (Silver Price) కాస్త తగ్గుదల నమోదు చేసే అవకాశం ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్పులు లేకుండా ఉంది.  అలాగే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరలో ఎటువంటి మార్పు లేదు.  ఇక దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోనూ ఈరోజు బంగారం ధరలు ఇదే ధోరణిలో ఉన్నాయి. అక్కడా  22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా నిలిచింది. మరోవైపు దేశవ్యాప్తంగా వెండి ధరలు కొద్దిగా తగ్గాయి. 

ఈరోజు హైదరాబాద్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి 

22 క్యారెట్లు 10 గ్రాములకు ₹ 66,700

24 క్యారెట్లు 10 గ్రాములకు ₹ 72,770

ఇక విజయవాడ ,  విశాఖపట్నం , తిరుపతి లలోనూ బంగారం ధరలు తగ్గుదల  కనబరిచాయి. ఆ ప్రాంతాల్లో ఈరోజు మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం ధరలు ఇలా ఉన్నాయి .  

22 క్యారెట్లు 10 గ్రాములకు ₹ 66,700

24 క్యారెట్లు 10 గ్రాములకు ₹ 72,770

దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు అలానే ఉన్నాయి.  ఈరోజు  మార్పులు లేకుండా ఉన్న బంగారం ధరలు కింది విధంగా ఉన్నాయి. 

 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ₹ 66,850

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ₹ 72,920

బంగారం ధరలు మార్పులు లేకుండా ఉంటే, మరోవైపు వెండి ధరలు కేజీకి 100 రూపాయలు తగ్గాయి. హైదరాబాద్ (Hyderabad) లోనూ ,  ఢిల్లీ (Delhi) లోనూ కూడా వెండి ధరలు తగ్గుదల నమోదు చేశాయి. 

హైదరాబాద్ లో వెండి ధర కేజీకి.. ₹ 90,900 గానూ ,  ఢిల్లీలో వెండి ధర కేజీకి ₹ 85,900 గానూ ఈరోజు మార్కెట్ ప్రారంభ సమయానికి ఉన్నాయి .  

ఇక అంతర్జాతీయంగా బంగారం ధరల్లో  తగ్గుదల కనిపిస్తోంది.   ఈరోజు అంటే సెప్టెంబర్ 4 ఉదయం 6 గంటల సమయానికి అంతర్జాతీయంగా బంగారం ధరలు ఔన్సు 2,494 డాలర్ల వద్ద ఉన్నాయి.  అలాగే వెండి ధరలు బాగా తగ్గి కేజీకి 901డాలర్లకు దగ్గరలో ట్రేడ్ అవుతున్నాయి.

Also Read : Italy: 10 వేల అడుగుల ఎత్తు నుంచి పడి..ఆడి ఇటలీ అధినేత మృతి!

Advertisment
Advertisment
తాజా కథనాలు