Gold Rates: బంగారం ధరలు ఈ మధ్య వరుసగా పెరుగుతూ వచ్చాయి. అయితే, రెండురోజుల తరువాత మళ్ళీ తగ్గుతూ వస్తున్నాయి. ఈ నెల 14, 15 తేదీల్లో భారీగా పెరిగి షాక్ ఇచ్చిన బంగారం ధరలు.. మళ్ళీ తగ్గుదల వైపు మళ్ళాయి. శనివారం కాస్త తగ్గిన బంగారం.. ఈరోజు(డిసెంబర్ 18) స్థిరంగా ఉంది. బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు సహజమే. ఇప్పుడు భారీగా పెరిగిన బంగారం కొద్దీ కొద్దిగా తగ్గుతూ రావడంతో బంగారం కొనాలనుకునేవారికి కాస్త ఊరట దొరికినట్టయింది. అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు(Gold Rates) తగ్గుతూ రావడంతో దేశీయంగా బంగారం ధరలు కిందికి దిగొస్తున్నాయి అని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఇక వెండి ధరల విషయానికి వస్తే.. బంగారం కంటే స్పీడ్ గా ధరలు పెరుగుతూ వచ్చాయి. గత వారంలో వరుసగా పెరిగిన వెండి ధరలు వారాంతానికి కాస్త కిందికి దిగివచ్చాయి. శనివారం కేజీకి 800 రూపాయల భారీ తగ్గుదల నమోదు చేసిన వెండి ఈరోజు స్థిరంగా ఉంది. సోమవారం (డిసెంబర్ 18) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
Also Read: మహిళలకు గుడ్ న్యూస్..ఖాతాల్లోకి రూ. 6వేలు..సర్కార్ అందిస్తున్న ఈ సాయం గురించి మీకు తెలుసా..?
హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Rates) ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈరోజు రూ.57,300ల దగ్గర ఉంది. 24 క్యారెట్ల బంగారం కూడా మార్పులు లేకుండా రూ.62,510ల వద్ద నిలిచింది. అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.57,450ల వద్ద ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Rates) ఎటువంటి మార్పులు లేకుండా రూ.62,660ల వద్ద నిలించింది.
మరోవైపు వెండి ధరలు కూడా మార్పులు లేకుండా ఉన్నాయి. హైదరాబాద్ లో వెండి కేజీ వెండి ధర స్థిరంగా రూ.77,700ల వద్ద ఉంది. ఇక ఢిల్లీ లో కూడా కేజీ వెండి ధర రూ. 79,700 వద్ద స్థిరంగా ఉంది.
అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు(Today Gold Rates) ఈరోజు తగ్గుముఖం పట్టాయి. ఈరోజు ఔన్స్ బంగారం(Gold Rates) 2020డాలర్ల వద్దకు దిగివచ్చి ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర 24 డాలర్ల కంటే కింద ట్రేడ్ అవుతూ వస్తోంది.
గమనిక: బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకున్నపుడు స్థానికంగా ఉన్న ధరలను పరిశీలించి చూసుకోవాలని సూచిస్తున్నాం.
Watch This interesting Video: