Gold Rates: బంగారం ధరలు ఈ మధ్య వరుసగా పెరుగుతూ వచ్చాయి. అయితే, రెండురోజుల తరువాత మళ్ళీ తగ్గుతూ వస్తున్నాయి. ఈ నెల 14, 15 తేదీల్లో భారీగా పెరిగి షాక్ ఇచ్చిన బంగారం ధరలు.. మళ్ళీ తగ్గుదల వైపు మళ్ళాయి. శనివారం కాస్త తగ్గిన బంగారం.. ఈరోజు(డిసెంబర్ 18) స్థిరంగా ఉంది. బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు సహజమే. ఇప్పుడు భారీగా పెరిగిన బంగారం కొద్దీ కొద్దిగా తగ్గుతూ రావడంతో బంగారం కొనాలనుకునేవారికి కాస్త ఊరట దొరికినట్టయింది. అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు(Gold Rates) తగ్గుతూ రావడంతో దేశీయంగా బంగారం ధరలు కిందికి దిగొస్తున్నాయి అని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఇక వెండి ధరల విషయానికి వస్తే.. బంగారం కంటే స్పీడ్ గా ధరలు పెరుగుతూ వచ్చాయి. గత వారంలో వరుసగా పెరిగిన వెండి ధరలు వారాంతానికి కాస్త కిందికి దిగివచ్చాయి. శనివారం కేజీకి 800 రూపాయల భారీ తగ్గుదల నమోదు చేసిన వెండి ఈరోజు స్థిరంగా ఉంది. సోమవారం (డిసెంబర్ 18) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
పూర్తిగా చదవండి..Gold Rates: హమ్మయ్య బంగారం కాస్త తగ్గింది.. ఇది గుడ్ న్యూసే కదా.. ఇప్పుడెంతంటే..
బంగారం ఈరోజు (డిసెంబర్ 18) స్థిరంగా ఉంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,300ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.62,510లవద్ద మార్పులు లేకుండా ఉన్నాయి. వెండి కూడా ఎటువంటి మార్పులు లేకుండా రూ.77,700ల వద్ద ఉంది.
Translate this News: