Gold Rate Today : వరుసగా రెండురోజుల పాటు తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు మార్పులు లేకుండా ఉన్నాయి. అలాగే వెండి విషయానికి వస్తే రెండురోజుల తగ్గుదలకు బ్రేక్ వేస్తూ స్థిరంగా ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే ఈరోజు అంటే సెప్టెంబర్ 2న బంగారం ధరలు మార్పులు లేకుండా ఉండి బంగారం కొనాలని అనుకునేవారికి ఊరట కలిగించాయని చెప్పవచ్చు. ఇక ఈరోజు అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు కొద్దిపాటి తగ్గుదలతో ట్రేడ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆప్రభావం మన మార్కెట్లపై కూడా కనిపించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దీంతో ఈరోజు మార్కెట్ ముగిసే సరికి బంగారం, వెండి ధరలు (Silver Price) స్థిరంగా లేదా కాస్త తగ్గుదల నమోదు చేసే అవకాశం ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Gold and Silver Price : తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర లో మార్పులు లేవు. అలాగే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు నిలకడగా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోనూ ఈరోజు బంగారం ధరలు ఇదే ధోరణిలో ఉన్నాయి. అక్కడా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు స్థిరంగా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్పులు లేకుండా నిన్నటి ధర వద్దే ట్రేడ్ అవుతోంది. మరోవైపు దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా నిలకడగా ఉన్నాయి. రెండురోజుల తగ్గుదలకు బ్రేక్ వేస్తూ ధరల్లో ఎలాంటి మార్పు రాలేదు.
ఈరోజు హైదరాబాద్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి
22 క్యారెట్లు 10 గ్రాములకు ₹ 66,950
24 క్యారెట్లు 10 గ్రాములకు ₹ 73,040
ఇక విజయవాడ , విశాఖపట్నం , తిరుపతి లలోనూ బంగారం ధరలు పెరుగుదల కనబరిచాయి. ఆ ప్రాంతాల్లో ఈరోజు మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం ధరలు ఇలా ఉన్నాయి .
22 క్యారెట్లు 10 గ్రాములకు ₹ 66,950
24 క్యారెట్లు 10 గ్రాములకు ₹ 73,040
దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు పైకెగశాయి . ఈరోజు పెరుగుదల కనబరిచిన బంగారం ధరలు కింది విధంగా ఉన్నాయి.
10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ₹ 67,150
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ₹ 73,250
Gold Rate Today: బంగారం ధరలు వరుసగా రెండు రోజులు స్వల్పంగా తగ్గి ఈరోజు నిలకడగా ఉన్నాయి. మరోవైపు వెండి ధరలు వరుసగా రెండురోజుల్లో కేజీకి 1500 వరకూ తగ్గి ఈరోజు స్థిరంగా నిపించాయి. హైదరాబాద్ లోనూ , ఢిల్లీలోనూ కూడా వెండి ధరల్లో మార్పులు లేవు.
హైదరాబాద్ లో వెండి ధర కేజీకి.. ₹ 92,000 గానూ , ఢిల్లీలో వెండి ధర కేజీకి ₹ 87,000 గానూ ఈరోజు మార్కెట్ ప్రారంభ సమయానికి ఉన్నాయి .
ఇక అంతర్జాతీయంగా బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. ఈరోజు అంటే సెప్టెంబర్ 2 ఉదయం 6 గంటల సమయానికి అంతర్జాతీయంగా బంగారం ధరలు ఔన్సు 2,501 డాలర్ల వద్ద ఉన్నాయి. అలాగే వెండి ధరలు కూడా పెద్దగా మారకుండా కేజీకి 927 డాలర్లకు దగ్గరలో ట్రేడ్ అవుతున్నాయి.