Gold Rate Today: బంగారం కొనాలని అనుకునే వారికి ఎప్పుడూ టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే, బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. ఇక బంగారంలో ఇన్వెస్ట్ చేసేవారి పరిస్థితి అదేవిధంగా ఉంటుంది. ఎప్పుడు తగ్గుతుందో.. ఎప్పుడు పెరుగుతుందో తెలీదు. ఈరోజు ఒక రేటు వద్ద బంగారం కొంటే మర్నాడు ఉదయానికి అది భారీగా తగ్గిపోయి షాక్ ఇవ్వడం సహజంగా జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఈరోజు రేటు పెరిగింది రేపు చూద్దాం అని అనుకుంటే మర్నాడు ఆ బంగారం ధర అమాంతం పెరిగిపోయి పసిడి ప్రియుల ఆశల మీద నీళ్లు జల్లే పరిస్థితి ఉంటుంది.
గత 20 రోజుల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. అయితే, ఆ పెరుగుదలకు బ్రేక్ వేస్తూ మూడు రోజుల పాటు బంగారం ధరలు(Gold Rates) అదేస్థాయిలో తగ్గిపోయాయి. ఎంత అంటే మూడు రోజుల్లో 10 గ్రాముల బంగారం దాదాపుగా 1000 రూపాయల పైన తగ్గిపోయింది. దీపావళి వస్తుంది హమ్మయ్య.. రేట్లు తగ్గుతున్నాయి అని పసిడి ప్రియులు సంబర పడే లోపు రెండు రోజులుగా బంగారం ధరలు మళ్ళీ పైకెగుస్తున్నాయి. పండుగ దగ్గర పడే కొద్దీ బంగారం మళ్ళీ హై కి చేరుతుందనే భయాలు పెరుగుతున్నాయి.
అయితే, అంతర్జాతీయంగా మాత్రం బంగారం రేటు(Gold Rates) ప్రస్తుతం తగ్గింది. కానీ, దేశీయంగా మాత్రం స్వల్ప పెరుగుదల నమోదు చేసింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా బంగారం రేటు ఔన్సు 1993 డాలర్ల దగ్గరలో ఉంది.
Also Read: లాభాల బాటలో స్టాక్ మార్కెట్.. గత వారం మార్కెట్ ఇలా..
ఇక మన దేశంలో పండుగ రోజుల నేపథ్యంలో ధరలు(Gold Rates) కాస్త పెరుగుదల బాటలోనే ఉన్నాయని చెప్పాలి. అయితే నిన్నటితో పోలిస్తే ఈరోజు బంగారం ధరలు(Gold Rates) నిలకడగానే ఉన్నాయని చెప్పవచ్చు. నవంబర్ 4వ తేదీన 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్ లో రూ.56,600ల వద్ద ఉంది. అలాగే, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,750 రూపాయల వద్ద కొనసాగుతోంది. అయితే, ఢిల్లీలో మాత్రం బంగారం ధరలు స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 100 రూపాయలు పెరిగి రూ. 56,750లుగా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 61,900 వద్ద ఉంది.
వెండి ధరలు ఇలా..
బంగారం ధరలు స్వల్ప పెరుగుదల నమోదు చేస్తుంటే, వెండి ధరలు(Silver Rate) మాత్రం భారీగా పడిపోయాయి. హైదరాబాద్ లో వెండి కేజీకి రూ.700లు పడిపోయింది. దీంతో రూ. 77,000లకు చేరుకుంది. అదేవిధంగా ఢిల్లీలో కూడా వెండి ధరలు కేజీకి 700 రూపాయలు తగ్గి రూ.74,100 వద్ద ఉన్నాయి.
మార్కెట్ పరిస్థితులు, డిమాండ్, అంతర్జాతీయంగా వచ్చే మార్పులు బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తాయి. దీంతో బంగారం, వెండి ధరలు ప్రతి రోజూ మారుతూ ఉంటాయి. ఒక్కోసారి గంటల వ్యవధిలో కూడా బంగారం, వెండి ధరల్లో మార్పులు రావచ్చు. అందుకే, బంగారం, వెండి కొనాలని అనుకునే ముందు మార్కెట్లో తాజా ధరలను పరిశీలించడం అవసరం.
Watch This Video - భారీ భూకంపం: