Gold Rates: బంగారం..వెండి ధరలు తగ్గుతూనే ఉన్నాయి.. ఈరోజు రేట్లివే!

బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,690ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.62,940ల వద్దకు దిగివచ్చాయి. ఇక వెండి ధర కేజీకి రూ.100 తగ్గి రూ.76,400 వద్ద ఉంది.

Gold Rates: బంగారం..వెండి ధరలు తగ్గుతూనే ఉన్నాయి.. ఈరోజు రేట్లివే!
New Update

Gold Rates Today: బంగారం ధరలు తగ్గుదల బాటలోనే ఉన్నాయి. గత కొన్నిరోజులుగా బంగారం  పది గ్రాములకు దాదాపుగా 600 రూపాయల వరకూ తగ్గింది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలో ధరలు తగ్గుతుండడంతో బంగారం కొనడానికి ఇదే మంచి సమయం అని అందరూ భావిస్తున్నారు.  బంగారం, వెండి ధరలు(Gold Rates) నిలకడగా ఉండేవి కావు.. అలానే ఇంకా తగ్గుతాయి అని కచ్చితంగా చెప్పేలా కూడా ఉండవు. ప్రస్తుతం అయితే, బంగారం ధరలు తగ్గుదల బాటలోనే ఉన్నాయి. బంగారం ధరల తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు అనిశ్చితంగా ఉండడం.. అలాగే అంతర్జాతీయంగా బంగారం ధరల్లో తగ్గుదల కనిపించడం.. స్థానికంగా బంగారం డిమాండ్ తగ్గుతూ రావడం బంగారం ధరలపై ప్రభావం చూపిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. మొత్తమ్మీద బంగారం ధరలు(Gold Rate) తగ్గుముఖం పట్టడం అనేది సామాన్యులకు కాస్త ఊరట ఇచ్చే అంశమని చెప్పవచ్చు. మరోవైపు నిన్ననిలకడగా ఉన్న వెండి ధరలు కూడా ఈరోజు తగ్గుదల కనబరిచాయి.  ఈరోజు అంటే సోమవారం (ఫిబ్రవరి 12) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.        

హైదరాబాద్ లో బంగారం ధరలు..
హైదరాబాద్(Hyderabad) లో వరుసగా నాలుగో రోజూ బంగారం ధరలు తగ్గుదల(Gold Rates) కనబరిచాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Price) స్వల్పంగా 10 రూపాయలు తగ్గి రూ.57,690ల వద్ద ఉంది.  24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 10 రూపాయలు తగ్గింది. దీంతో రూ. 62,940లకు దిగివచ్చింది.  

ఢిల్లీ లో ఇలా..
అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు తగ్గుదల బాటలోనే ఉన్నాయి. ఇక్కడ  22 క్యారెట్ల బంగారం ధర (Gold Price) 10 గ్రాములకు 10 రూపాయలు తగ్గి రూ.57,840ల వద్ద ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా 10 గ్రాములకు 10 రూపాయలు తగ్గింది.  దీంతో  రూ.63,090ల వద్ద కు చేరింది. 

Also Read: బంగారం కొనాలంటే మంచి ఛాన్స్.. నిలకడగా ధరలు.. ఎంతంటే.. 

వెండి ధరలు ఇలా..
ఇక వెండి విషయానికి వస్తే.. బంగారం ధరలు(Gold Price) తగ్గుదల కనపరుస్తుంటే మరోవైపు వెండి ధరలు కూడా ఈరోజు తగ్గాయి.  హైదరాబాద్ లో వెండి కేజీకి  100 రూపాయలు తగ్గి రూ.76,400ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ వెండి రేటు కేజీకి 100 రూపాయలు తగ్గింది. దీంతో ఇక్కడ కేజీ వెండి ధర రూ. 74,900లకు దిగివచ్చింది. 

మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరలు(Gold Rates Drop) వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. ఈరోజు ఔన్స్ బంగారం(Gold Price Today)  2025 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర(Gold and Silver) ఔన్స్ 22.68 డాలర్లుగా కొనసాగుతోంది.  

గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకున్నపుడు స్థానికంగా ఉన్న ధరలను పరిశీలించి చూసుకోవాలని సూచిస్తున్నాం.

Watch this Interesting Video:

#gold-price #gold
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి