Gold Rates Drop: భలే ఛాన్స్.. దిగివస్తున్న బంగారం ధరలు.. ఈరోజు ఎంతంటే.. 

వరుసగా మూడు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,400ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.62,770ల వద్దకు దిగివచ్చాయి.  ఇక వెండి ధర కేజీకి 400 తగ్గి  రూ.77,000 వద్ద ఉంది.

Gold Price Drop: గోల్డ్ లవర్స్ కు భలే ఛాన్స్.. భారీగా తగ్గిన ధరలు.. ఎంతంటే..
New Update

Gold Rates Drop: ఈ సంవత్సరం ప్రారంభం నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు మధ్యలో మూడురోజుల పాటు పెరుగుదల కనపరిచాయి. దీంతో బంగారం కొనాలనుకునే వారికీ టెన్షన్ మొదలైంది. అయితే, తరువాత నుంచి వరుసగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. వరుసగా మూడు రోజులుగా బంగారం ధరలు(Gold Rates Drop) తగ్గుతూ పసిడి ప్రియులకు సంతోషాన్నిస్తున్నాయి. బంగారం ధరలు తగ్గుతుండడంతో కొనడానికి ఇదే మంచి సమయం అని అందరూ భావిస్తున్నారు.  బంగారం, వెండి ధరలు నిలకడగా ఉండేవి కావు.. అలానే ఇంకా తగ్గుతాయి అని కచ్చితంగా చెప్పేలా కూడా ఉండవు. ప్రస్తుతం అయితే, బంగారం ధరలు తగ్గుదల బాటలోనే ఉన్నాయి. వెండి కూడా ప్రతి రోజూ తగ్గుతూనే వస్తోంది. బంగారం ధరల తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు అనిశ్చితంగా ఉండడం.. అలాగే అంతర్జాతీయంగా బంగారం ధరల్లో తగ్గుదల కనిపించడం.. స్థానికంగా బంగారం డిమాండ్ తగ్గుతూ రావడం బంగారం ధరలపై ప్రభావం చూపిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. మొత్తమ్మీద బంగారం ధరలు(Gold Rates Drop) తగ్గుముఖం పట్టడం అనేది సామాన్యులకు కాస్త ఊరట ఇచ్చే అంశమని చెప్పవచ్చు. మరోవైపు రెండురోజులుగా తగ్గుతూ వస్తున్న వెండి ధరలు ఈరోజు కూడా తగ్గాయి.   ఈరోజు అంటే శుక్రవారం (జనవరి 19) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.      

హైదరాబాద్ లో బంగారం ధరలు:     

హైదరాబాద్(Hyderabad) లో వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు కూడా తగ్గుదల(Gold Rates Drop) కనబరిచాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Price) 300 రూపాయలు తగ్గి రూ.57,400ల వద్ద ఉంది.  24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 330 రూపాయలు తగ్గింది. దీంతో రూ. 62,620లకు దిగివచ్చింది.   అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు తగ్గుదల బాటలోనే ఉన్నాయి. ఇక్కడ  22 క్యారెట్ల బంగారం ధర (Gold Price Today) 10 గ్రాములకు 300 రూపాయలు తగ్గి రూ.57,550ల వద్ద ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా 10 గ్రాములకు 330 రూపాయలు తగ్గింది.  దీంతో  రూ.62,7700ల వద్ద కు చేరింది. 

Also Read: బంగారం ధరలు దిగి వస్తున్నాయి..వెండి ధర భారీగా పడిపోయింది..ఈరోజు ఎంతుందంటే.. 

వెండి ధరలు ఇలా: 

ఇక వెండి విషయానికి వస్తే.. బంగారం ధరలు(Gold Price Today) తగ్గుదల కనపరుస్తుంటే మరోవైపు వెండి ధరలు కూడా వరుసగా మూడోరోజూ తగ్గుదల కనబరిచాయి.  కేజీ వెండి ధరలు 400 రూపాయల మేర తగ్గాయాయి.  దీంతో  హైదరాబాద్ లో వెండి కేజీకి  రూ.77,000ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ వెండి రేటు 400 రూపాయలు తగ్గింది.  దీంతో ఇక్కడ కేజీ వెండి ధర రూ. 75,500 లకు తగ్గింది. 

మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరలు(Gold Rates Drop) కాస్త పెరిగాయి.   ఈరోజు ఔన్స్ బంగారం(Gold Price Today)  2014 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర(Gold and Silver) ఔన్స్ 22.63 డాలర్లుగా కొనసాగుతోంది.  

గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకున్నపుడు స్థానికంగా ఉన్న ధరలను పరిశీలించి చూసుకోవాలని సూచిస్తున్నాం

Watch this interesting Video:

#gold-and-silver-price #gold
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి