Gold Rates Today : రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోయిన బంగారం ధరలు(Gold Rates) నిన్న కాస్త దిగివచ్చిన సంగతి తెలిసిందే. పరుగులు తీస్తున్న బంగారం ధరలకు బ్రేక్ పడినట్లయింది. ఈరోజు బంగారం ధరల్లో ఎటువంటి మార్పు లేదు. బంగారం కొనాలనుకునే వారు ప్రతిరోజూ పెరుగుతున్న ధరలతో టెన్షన్ పడుతూ వస్తున్నారు. అయితే, నిన్న బంగారం ధరలు(Gold Rates) దిగిరావడం.. ఈరోజు స్థిరంగా ఉండడంతో.. పసిడి ప్రియులకు కాస్త ఊరట లభించింది అని చెప్పవచ్చు. మరోవైపు నిన్న కాస్త తగ్గుదల కనబరిచిన వెండి ధరలు కూడా ఈరోజు స్థిరంగా ఉన్నాయి. బంగారంతో పాటే వెండి ధరలు కూడా ఇటీవల కాలంలో పైపైకి దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.
సాధారణంగా బంగారం ధరలు(Gold Rates) ప్రతిరోజూ పైకీ.. కిందికీ కదులుతూనే ఉంటాయి. కానీ, ఇటీవల కాలంలో మాత్రం పైకి కదలడం తప్ప కిందికి దిగిరావడం లేదు. ఈ నేపథ్యంలో బంగారం కొనాలనుకునే సామాన్యులకు ప్రతిరోజూ నిరాశ కలుగుతూనే ఉంటోంది. అయితే, ఈరోజు మాత్రం బంగారం ధరల పెరుగుదలకు బ్రేక్ పడింది. బంగారం ధరల(Gold Rates) తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో వచ్చే మార్పులు, సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనడంపై చూపించే ఉత్సాహం, అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు, అమెరికా ఫెడ్ రేట్లలో మార్పులు బంగారం ధరల్లో మార్పులకు కారణంగా నిపుణులు చెబుతారు.
ఇక ఈరోజు అంటే ఏప్రిల్ 15న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర(Gold Rates) పెరుగుదల కనబరిచింది. కానీ, దేశీయంగా మాత్రం బంగారం ధరలు స్థిరంగా నిలిచాయి. మరోవైపు వెండి ధరలు కూడా అంతర్జాతీయంగా పెరుగుదల నమోదు చేశాయి. అయితే, ఇక్కడ మాత్రం మార్పులు లేకుండా ఉన్నాయి. ఈరోజు అంటే సోమవారం (ఏప్రిల్ 15) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు(Gold and Silver Rates Today) దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
హైదరాబాద్ లో బంగారం ధరలు..
హైదరాబాద్(Hyderabad) లో వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు నిలకడగా ఉన్నాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,500ల వద్ద మార్పులు లేకుండా ఉంది. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు రూ.72,610ల వద్ద ఉంది.
ఢిల్లీలో బంగారం ధరలు ఇలా..
అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు(Gold Price) స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు(Gold Rates) రూ.66,650ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరకూడా మార్పులు లేకుండా రూ.72,700ల వద్ద నిలిచింది.
Also Read : హమ్మయ్య.. గోల్డ్ లవర్స్ కి గుడ్‌న్యూస్..బంగారం ధరలు తగ్గాయ్!
వెండి ధరలు ఇలా..
ఇక వెండి విషయానికి వస్తే.. బంగారం ధరల(Gold Rate Today) పెరుగుదల తో పాటే వెండి కూడా రికార్డు పరుగులు తీస్తున్న విషయం తెలిసిందే. అయితే, నిన్న కాస్త తగ్గుదల చూపిన వెండి ధరలు ఈరోజు నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్ లో కేజీ వెండి రూ.89,000ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ కేజీ వెండి రూ.85,500ల వద్ద ఉంది.
అంతర్జాతీయంగా..
మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. ఈరోజు ఔన్స్ బంగారం 18 డాలర్ల వరకూ పెరిగింది. దీంతో 2362.48 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర స్వల్ప పెరుగుదలతో(Gold And Silver Price) ఔన్స్ 28.30డాలర్లకు చేరింది.
గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకుంటే, అన్ని అంశాలను పరిశీలించి.. స్థానికంగా ఉన్న మార్కెట్ రేట్లను స్పష్టంగా తెలుసుకుని కొనుక్కోవడం మంచిది.