Gold Rates: కొనాలనుకుంటే మంచి ఛాన్స్.. బంగారం-వెండి ధరల్లో మార్పులు లేవు!

అంతర్జాతీయంగా బంగారం ధరల్లో మార్పులు లేకపోవడంతో దేశీయంగా కూడా బంగారం, వెండి ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ప్రారంభ ధర 10 గ్రాములకు రూ. 56,800లు గానూ, 24 క్యారెట్లు రూ. 61,970లుగానూ ఉంది. వెండి కేజీకి రూ.79,200గా ఉంది. 

New Update
Gold Rates Hike: మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే.. 

Gold Rates: మన దేశంలో బంగారంపై విపరీతమైన మోజు ఉంటుంది. పండుగ సమయాల్లో బంగారానికి చాలా డిమాండ్ ఉంటుంది. అందులోనూ దీపావళి పండుగ అంటే బంగారం కొనాలని చాలామంది పరుగులు తీస్తారు. అందుకే ఎప్పుడూ దీపావళి పండుగ సమయంలో బంగారం ధరలు పెరుగుతూ ఉంటాయి. అయితే, ఈసారి మాత్రం అందుకు విరుద్ధంగా జరిగింది. బంగారం ధరలు బాగా దిగివచ్చాయి. పండుగ వారంలో ప్రతి రోజూ బంగారం ధరలు కింది చూపులే చూశాయి. పండగ వెళ్లిన వెంటనే బంగారం ధరల్లో పెరుగుదల ప్రారంభం అయింది. పండగ తరువాతి వారంలో బంగారం ధర పెరిగింది. కానీ, ఆ తరువాత నుంచి తగ్గడం మొదలైంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం బంగారం ధర పెద్దగా మార్పులు లేకుండా వారం రోజులుగా కొనసాగింది. అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గుతుండడం దీనికి కారణంగా చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు ప్రతి రోజూ పైకీ కిందికీ కదిలాయి. మొత్తంగా చూసుకుంటే పండగ తరువాత వెండి ధరలు బాగా పెరిగాయని చెప్పవచ్చు.  ఎప్పటికప్పుడు మార్పులు చేసుకునే బంగారం, వెండి ధరలు ఈరోజు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 

అంతర్జాతీయంగా బంగారం ధరలు(Gold Rates) స్థిరంగా ఉన్నాయి.  దీని ఎఫెక్ట్ దేశీయంగా కూడా కనిపించింది. బంగారం ధరలు(Gold rate today) ఈరోజు (నవంబర్ 25)న అంతర్జాతీయంగా మార్పులు లేకుండా 1993 డాలర్ల వద్ద నిలిచింది. ఇక దేశీయంగా కూడా బంగారం ధరలు ఇదే ధోరణి కనబరిచాయి.  రోజు మార్పులు లేకుండా స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు కూడా ఎటువంటి మార్పు లేకుండా నిలిచాయి. 

హైదరాబాద్ లో ఈరోజు రేట్లు ఇలా..

అంతర్జాతీయంగా బంగారం ధరలు స్థిరంగా ఉండడంతో ఆ ప్రభావం దేశీయంగానూ కనిపించింది. దీంతో హైదరాబాద్ లో బంగారం ధరలు ఎటువంటి మార్పులు లేకుండా నిలిచాయి.  ఈరోజు ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,800ల వద్ద స్థిరంగా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు 61,970 రూపాయల వద్ద నిలిచింది.

Also Read: ఆగని బంగారం ధరల పరుగు.. 80వేలకు దగ్గరలో వెండి..

ఇదిలా ఉంటె వెండి ధరలు కూడా బంగారం ధరల బాటలోనే స్థిరంగా ఉన్నాయి. ఈరోజు హైదరాబాద్ లో కేజీ వెండి ధర ఎటువంటి మార్పులు లేకుండా రూ. 76,200ల వద్ద నిలిచింది. 

ఢిల్లీలో ఇలా..

ఢిల్లీ మార్కెట్లోనూ బంగారం, వెండి  ధరలు స్థిరంగా ఉన్నాయి. అక్కడ బంగారం ధర(Gold rate today) 22 క్యారెట్లు.. 10 గ్రాములకు రూ.56,950ల వద్ద ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం62,120 రూపాయల వద్ద స్థిరంగా ఉంది. ఇక కిలో వెండి ధర ఢిల్లీలోరూ. 76,200ల వద్ద మార్పులు లేకుండా నిలిచింది. 

గమనిక: ఇక్కడ అందించిన ధరలు ఈరోజు ఉదయం మార్కెట్ ప్రారంభ సమయానికి ఉన్న ధరలు. బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అలాగే, స్థానికంగా ఉండే డిమాండ్, టాక్స్ లు వంటివి కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. అందువల్ల బంగారం కొనాలి అనుకున్నపుడు మార్కెట్ ధరలను ఒకసారి పరిశీలించడం అవసరం.

Watch this interesting Video:

Advertisment
తాజా కథనాలు